Rythu Bharosa: రైతు భరోసాపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్
రైతు భరోసా ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ముందుకు వెళ్తామన్నారు. ఆదివారం సచివాలయంలో ఆయన మంత్రులతో సమీక్షించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రైతు భరోసా ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ముందుకు వెళ్తామన్నారు. ఆదివారం సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం అయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధానాలపై వారు చర్చలు జరిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతుల అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై కసరత్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రైతలుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ను ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.110 రైతు వేదికల్లో రూ.4 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. 1,57,51000 ఎకరాలకు 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 2024-25లో రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2023-24 ఏడాదికి ఆయిల్ సాగు పథకం కింద కేంద్రం.. 80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 133.5 కోట్లు విడుదలేనట్లు చెప్పారు. అలాగే సన్నవడ్లకు ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్‌గా చెల్లిస్తున్నామనే విషయాన్ని గుర్తుచేశారు.

Also Read: బోరుబావిలో పడిన బాలుడు.. 16 గంటలు శ్రమించినా.. !
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రైతలుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ను ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.110 రైతు వేదికల్లో రూ.4 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. 1,57,51000 ఎకరాలకు 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 2024-25లో రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2023-24 ఏడాదికి ఆయిల్ సాగు పథకం కింద కేంద్రం.. 80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 133.5 కోట్లు విడుదలేనట్లు చెప్పారు. అలాగే సన్నవడ్లకు ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్‌గా చెల్లిస్తున్నామనే విషయాన్ని గుర్తుచేశారు.
Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్