ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుపై ఇచ్చిన నోటీసులకు థియేటర్‌ పోలీసులకు రిప్లై ఇచ్చింది. డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్‌ షోకు 80 మంది థియేటర్‌ సిబ్బంది విధుల్లో ఉన్నారు. డిసెంబరు 4, 5న థియేటర్‌ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్‌ తీసుకుందని తెలిపింది.

New Update
sandhya theatre management

sandhya theatre management

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనా నేపథ్యంలో పోలీసులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 'పుష్ప 2' ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ తన కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ రష్మిక థియేటర్‌కు హాజరయ్యారు. 

ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోవడంతో భారీ గందరగోళం నెలకొంది. ఆ హడావిడిలో తొక్కిసలాట జరగ్గా.. దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Also Read:పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

"తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరించండి" అని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే, లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు.

ఎప్పుడూ జరగలేదు..

తాజాగా, థియేటర్ యాజమాన్యం పోలీసులకు 6 పేజీల వివరణాత్మక లేఖను న్యాయవాదుల ద్వారా పంపించింది. అందులో, " సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. గత 45 ఏళ్లుగా థియేటర్ ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. 

ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా థియేటర్‌లో 80 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అలాగే డిసెంబర్ 4, 5 తేదీల్లో మైత్రి మూవీస్ థియేటర్‌ను ఎంగేజ్ చేసుకున్నారు.

Also Read:యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

గతంలో అనేక చిత్రాల విడుదల సందర్భంగా హీరోలు థియేటర్స్ కు హాజరయ్యారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అలాగే, థియేటర్‌లో టూ వీలర్వా, ఫోర్ వీలర్ వెహికిల్స్ కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.." అని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు