ప్రశ్నపత్రం లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీక్‌ కావడంతో మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఆదివారం సీఎం నితీశ్ కుమార్‌ను కలిసేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు.దీంతో పోలీసులు వాళ్లపై లాఠీఛార్జీ చేశారు. వాటర్ కెనన్లు ప్రయోగించారు.

New Update
Lathi Charge in Bihar

Lathi Charge in Bihar

బీహార్‌లో డిసెంబర్ 13న నిర్వహించిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్ష పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్షను మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు గత కొన్నిరోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఆదివారం ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. సీఎం నితీశ్ కుమార్‌ను కలిసేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు, పోలుసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు అదుపుతప్పడంతో పోలీసులు ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులపై లాఠీఛార్జీ చేశారు. వాటర్ కేన్లను కూడా ప్రయోగించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

Also read: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ

ఈ నేపథ్యంలో బీపీఎస్సీ పరీక్ష పేపర్‌ లీక్‌పై పలువురు అభ్యర్థులు మాట్లాడారు. రాష్ట్రంలో బీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలు ఆనవాయితీగా మారాయంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అందుకే తాము నిరసన బాట పట్టామని వివరించారు.      

Also Read:  దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!

మరోవైపు ఈ అంశంపై పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడారు. గాంధీ మైదాన్ నిషేధిత ప్రాంతం కాబట్టి విద్యార్థులు అక్కడ గుమికూడేందుకు పర్మిషన్ లేదని అన్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం కూడా నిరసనల్లో పాల్గొన్నట్లు తేలితే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాంధీ మైదాన్, పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా సిబ్బందిని నియమించామని.. చట్టాన్ని అతిక్రమించే వాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు.  

Also Read:యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

Also Read: బోరుబావిలో పడిన బాలుడు.. 16 గంటలు శ్రమించినా.. !

Advertisment
తాజా కథనాలు