Stock Market: భారత-పాక్ యుద్ధం..కుప్పకూలిన స్టాక్ మార్కెట్
భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీ కూడా పడింది. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు తగ్గి 79,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు పడిపోయి..24,000 వద్ద ఉంది.
భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీ కూడా పడింది. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు తగ్గి 79,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు పడిపోయి..24,000 వద్ద ఉంది.
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి..పాక్ ఆర్మీ కాల్పులు చేస్తూనే ఉంది. పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న 50 డ్రోన్లను భారత్ కూల్చేసింది. ఉదంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో వీటిని పడగొట్టింది.
భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిత్తుచిత్తవుతోంది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ మునీర్ ఆసిమ్ అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకవైపు భారత ఆర్మీ పాక్ మీద విరుచుకుపడుతోంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేస్తోంది. ప్రావిన్షియల్ రాజధాని క్వెట్టాతో అన్ని ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంది.
నిన్న రాత్రి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయింది. దీని తరువాత స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఖాళీ చేయించడంలో బీసీసీఐ చాకచక్యంగా వ్యవహరించింది. లైట్స్ ఆపేసి టెక్నికల్ ప్రాబ్లెమ్ అని చెప్పి..అందరినీ బయటకు పంపించేశారు.
జమ్మూ, కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో భారత, పాక్ ఆర్మీ దళాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు, పంజాబ్లోని చండీగఢ్, ఫిరోజ్పూర్, మొహాలి , గురుదాస్పూర్..రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్అవుట్ లో ఉన్నాయి.
ఆపరేషన్ సింధూలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతం అయ్యాడా అంటే అవుననే చెబుతున్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం భారత ఆర్మీ వదిలిన మిస్సైల్ హఫీజ్ తలదాచుకున్న మురిద్కే లోని మసీదును హిట్ చేసింది. దీంతో ఇందులోనే అతను కచ్చితంగా మరణించి ఉంటాడని అంటున్నారు.
ఆపరేషన్ సింధూర్..పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన దాడి. ఇది 1971లో భారత, పాక్ యుద్ధాన్ని తలపిస్తోంది. ఆ వార్ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు భారత త్రివిధ దళాలు కలిసి పాల్గొనడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.