/rtv/media/media_files/2025/10/07/us-pakistan-2025-10-07-09-37-01.jpg)
గత కొన్ని రోజులుగా అమెరికా, పాకిస్తాన్(America-Pakistan) చాలా దగ్గర అయ్యాయి. చాలాసార్లు పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ మునీర్ లు అమెరికాకు వచ్చి ట్రంప్ తో చర్చలు చేశారు. దీని బట్టి రెండు దేశాల మధ్యనా ఏదో జరుగుతుందనే అనుకున్నారు అందరూ. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల బట్టి అమెరికా, పాక్ మధ్య అరుదైన ఖనిజాలకు సంబంధించి ఒప్పందం కుదిరించదని తెలుస్తోంది. తాజాగా తమ దేశంలో ఉన్న అరుదైన ఖనిజాల మొదటి షిప్ మెంట్ ను పాక్ కు అమెరికాకు పంపింది. ఇందులో నియోడైమియం, ప్రసోడైమియం వంటి అరుదైన ఖనిజాలు ఉన్నాయి. వీటితో పాటూ యాంటిమోనీ, రాగి కూడా ఎగుమతి చేశారని తెలుస్తోంది.
Also Read : ఇల్లినాయిస్ లో నేషనల్ గార్డ్స్.. వదిలిపెట్టేది లేదంటున్న ట్రంప్
పాక్ ద్వారా ఖనిజాల మార్కెట్ పై నియంత్రణ..
పాకిస్తాన్, అమెరికా తమ ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళుతున్నాయి. పాకిస్తాన్ లోని రేర్ ఎర్త్ మెటల్స్‌కు సంబంధించి.. పాకిస్తాన్‌తో అమెరికన్ సంస్థ యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ .. సెప్టెంబర్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అరుదైన ఖనిజాల నమూనా రవాణా.. ప్రపంచ క్లిష్టమైన ఖనిజాల సప్లై చైన్‌లో పాకిస్తాన్‌ను కూడా చేర్చడంలో కీలకమైన అడుగు అని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకున్న యూఎస్ఎస్ఎమ్...ఆ దేశంలో ఖనిజ శుద్ధి, అభివృద్ధి కోసం దాదాపు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమల అభివృద్ధికి, జాతీయ భద్రతకు ఈ అరుదైన ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైనవని అమెరికా చెబుతోంది. ఈ ఖనిజాల ఎగుమతితో పాటూ...దానికి అనువుగా ఉండేలా పాకిస్తాన్ తన దేశంలోని పాస్ని ఓడరేవును రూడా అమెరికాకు అప్పగించనుందని చెబుతున్నారు. ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని గ్వాదర్ జిల్లాలో ఉంది. ఇక ఈ డీల్ తో పాకిస్తాన్ ప్రపంచ క్లిష్టమైన ఖనిజాల మార్కెట్‌లో అడుగుపెట్టనుందని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఉపయోగించని ఖనిజ నిల్వలు సుమారు 6 ట్రిలియన్ డాలర్లు..దీనిని అమెరికా తన కోసం ఉపయోగించుకోనుంది. దీని వలన ఆ దేశానికి అవసరమైన ముడి పదార్థాల లభ్యత పెరగనుంది. దీని వలన ఖనిజాల మార్కెట్ ను నియంత్రించే ఇతర దేశాల ఆధిపత్యాలను అడ్డుకోవాలని అమెరికా బిగ్ ప్లాన్ వేస్తోంది. ముఖ్యంగా చైనాను అడ్డుకోవడానికే అమెరికా పాక్ ను ఉపయోగించుకుంటోంది.
Also Read : నేడు, రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం.. కనువిందు చేయనున్న సూపర్‌మూన్
సొంత దేశంలోనే వ్యతిరేకత..
అయితే ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ లోని సొంత ప్రజలతో పాటూ మిగతా దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అగ్రరాజ్యానికి పాకిస్తాన్ దాసోహం అయ్యిందని పాక్ లో విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో ప్రతిపక్ష పార్టీ అయిన పీటీ: కూడా దీనిపై ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం పార్లమెంటరీ ఆమోదం లేకుండా అమెరికాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని బాహాటంగా వ్యాఖ్యలు చేసింది. ఈ రహస్య ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలను పాక్ ప్రభుత్వం విడుదల చేయాలని పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్కాస్ అక్రమ్ డిమాండ్ చేశారు. ఇలాంటి అనాలోచిత, ఏకపక్ష ఒప్పందాలు పాకిస్తాన్‌లో ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితులను మరింతగా దిగజార్చుతాయని పీటీఐ ఆరోపిస్తోంది.