Canada PM Carney: ఇండియా-పాక్ మధ్య శాంతి..ట్రంప్ కు కెనడా ప్రధాని కార్నీ ప్రశంసలు..

భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి మీరే కారణం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కెనడా ప్రధాని కార్నీ ప్రశంసించారు. ఒక వైపు ఎడతెగని సుంకాల మోత, మరోవైపు నోబెల్ బహుమతుల ప్రకటన...ఈ నేపథ్యంలో కార్నీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.

New Update
us-canada

Trump-Carney

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ తో పాటూ మరో ఐదు దేశాలు ఆయనను నోబెల్ పీస్ అవార్డ్ కు నామినేట్ చేశారు. రెండు రోజుల క్రితం నోబెల్ బహుమతుల ప్రకటన మొదలైంది. ఈ క్రమంలో ట్రంప్ కు నోబెల్ ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలవడానికి వచ్చిన కెనడా ప్రధాని కార్నీ ఆయనను పొగడ్తల్లో ముంచెత్తారు. 

ఆయన వల్లే శాంతి..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక పరివర్తన చెందిన మనిషి అన్నారు కెనడా ప్రధాని కార్నీ. భారత్,పాకిస్తాన్ ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను కార్నీ ప్రశంసించారు. ఆయన వల్లే రెండు దేశాల మధ్యనా శాంతి నెలకొందని అన్నారు. మంగళవారం కార్నీ వైట్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో పాటూ ప్రపంచ వ్యవహారాలు, ఆర్థిక స్థిరత్వంపై ట్రంప్ ప్రభావాన్ని కూడా ఆయన ప్రశంసించారు. మొత్తం ఏడు యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. దానిపై కూడా కార్నీ మాట్లాడారు. ఇదంతా ట్రంప్ ఒక్కవల్లనే సాధ్యమైందని అన్నారు. అమెరికా వాణిజ్య పరపతి దానిని "శాంతి పరిరక్షక" దేశంగా నిలబెట్టిందని అన్నారు. కెనడాపై వరుసపెట్టి సుంకాలతో విరుచుకుపడుతోంది అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ బుజ్జగించడానికే కార్నీ ఈ వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో పాటూ నోబెల్ బహుమతుల అనౌన్స్ మెంట్ జరుగుతున్న నేపథ్యంలో కూడా కార్నీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

పదే పదే ఖండించిన భారత్..

తాను అధికారం చేపట్టారు ఏడు యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. తాను అన్ని విధాలా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడునని పదేపదే చెబుతున్నారు. ఇందులో భారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ కూడా ఉంది. ఈ రెండు దేశాలకు మధ్యా శాంతిని తానే నెలకొల్పానని ట్రంప్ దాదాపు 50 సార్లు అయినా చెప్పి ఉంటారు. తన దౌత్య ప్రయత్నాలు, సుంకాల విధింపు వల్లనే భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ కు ఒప్పుకున్నాయని ట్రంప్ అంటున్నారు. ఈ వాదనకు పాకిస్తాన్ మద్దతు ఇవ్వగా...భారత్ మాత్రం తోసిపుచ్చింది. తమ రెండు దేశాల మధ్యా కాల్పుల విరమణ విషయంలో ఎవరి జోక్యం లేదని ఇండియా పదే పదే చెప్పింది. భారతదేశం- పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య ఏర్పాటు చేయబడిన సైనిక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా నేరుగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పదే పదే ట్రంప్ వాదనను ఖండించింది.

Also Read: Rajasthan: హైవే పై పేలుడు..గ్యాస్ సిలెండర్ల ట్రక్కును ఢీకొన్న మరో ట్రక్కు

Advertisment
తాజా కథనాలు