Trump Tariffs: మళ్ళీ టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్.. వాటిపై 25% సుంకాలు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ సుంకాల మోత మోగించారు. ఈ సారి భారీ ట్రక్కులు మీద 25 శాతం సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. 

New Update
trucks

వరుసపెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత మొగిస్తున్నారు. ఇప్పటికే ఇండియాపై 50 శాంత సుంకాలు అమలు అవుతున్నాయి. దీనికి తోడు ఫార్మాపై 100 టారిఫ్ లను విధించారు. ఇప్పుడు వీగికి అదసంగా భారీ ట్రక్కుల దిగుమతిపై 25 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికన్ పరిశ్రమ, కార్మికులను రక్షించడానికే ఈ సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ చెప్పారు. 

అమెరికన్ ట్రక్ తయారీదారులను కాపాడ్డానికే..

నవంబర్ 1 నుంచి అమెరికాలో దిగుమతి చేసుకునే అన్ని మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలను అమలు చేయనున్నారు. విదేశీ ఉత్పత్తుల నుంచి అమెరికన్ ట్రక్ తయారీదారులను రక్షించడానికే ఈ చర్య తీసుకున్నామని ట్రంప్ చెబుతున్నారు. దీనికి సంబంధించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకం విధించబడుతుంది. అన్యాయమైన విదేశీ పోటీ నుంచి అమెరికన్ కంపెనీలు, కార్మకులను రక్షించడానికే ఈనిర్ణయం తీసుకున్నామని చెబుతూ పోస్ట్ పెట్టారు. విదేశీ డంపింగ్, అన్యాయమైన వాణిజ్య విధానాల వల్ల మా పరిశ్రమలు దెబ్బతినడానికి మేము అనుమతించమని అన్నారు. 

తాజాగా ట్రంప్ విధించిన సుంకాలకు మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ దేశాలు అత్యంత ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. అన్నింటి కంటే ఎక్కువగా మెక్సికో యూఎస్ కు హెవీ ట్రక్కులను ఎగుమతి చేస్తుంది. 2019 నుండి, మెక్సికన్ ట్రక్కుల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి దాదాపు 340,000 యూనిట్లకు చేరుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్, మెక్సికో మరియు కెనడా మధ్య USMCA ఒప్పందం ప్రకారం, ట్రక్కుల విలువలో 64% ఉత్తర అమెరికా నుండి వస్తే వాటిని ప్రస్తుతం సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం విధించిన టారీఫ్ ల వలన ఇది ప్రభావితం కానుంది.  నిజానికి ఈ సుంకాలను ట్రంప్ గల నెల అక్టోబర్ 1 నుంచే అమలు చేస్తామని చెప్పారు. కానీ తరువాత వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా ఈ కొత్త 25 శాతం సుంకాలను నవంబర్ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. 

Also Read: Chicago: ఇల్లినాయిస్ లో నేషనల్ గార్డ్స్..వదిలిపెట్టేది లేదంటున్న ట్రంప్

Advertisment
తాజా కథనాలు