H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ప్రయాణాలు వద్దు..కాలిఫోర్నియా యూనివర్శిటీ వార్నింగ్

హెచ్ 1బీ వీసాదారులు ఇప్పుడు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అంటోంది కాలిఫోర్నియా యూనివర్శిటీ. వీసా రూల్స్ పై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్ 1బీ వీసాల మీద ఉన్న అధ్యాపకులు, సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించింది. 

New Update
H1B Visa

H1B Visa

అమెరికాలో హెచ్ 1బీ రూల్స్ ను కఠినతరం చేసేసింది ట్రంప్ గవర్నమెంట్. దీని ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది. ఇది చాలా ప్రకంపనలనే సృష్టించింది. దీని కారణంగా చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్చరికలను జారీ చేసింది. చాలా మంది ప్రయాణాలు ఆపేసుకున్నారు. ఆల్రెడీ స్వదేశాలకు వెళ్ళిన వారు వెంటనే తిరిగి వెనక్కు వచ్చేశారు. అయితే తరువాత ఈ లక్ష డాలర్ల ఫీజు కొత్తగా హెచ్ 1బీ వీసా అప్లై చేసుకునే వారికి మాత్రమే వైట్ హౌస్ క్లారిఫై చేసింది. దీంతో పరిస్థితి కాస్త నెమ్మదించింది.

ఎక్కడకీ వెళ్ళకండి.. 

కానీ కాలిఫోర్నియా యూనివర్శిటీ మాత్రం ఇంకా తమ అద్యాపకులను, సిబ్బందిని ఎక్కడికీ వెళ్ళొద్దని చెబుతోంది. ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలను పెట్టుకోవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం హెచ్ 1బీ వీసాలపై అనిశ్చితి ఉందని..అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిదని అంటోంది. యూనివర్శిటీలో దీనికి సంబంధించిన ప్రకటనను జారీ చేసింది. మళ్ళీ తాము చెప్పే వరకూ ఎవరూ కదలొద్దని గట్టిగా చెప్పింది యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్. ప్రస్తుతం అమెరికా బయట ఉన్న హెచ్ 1బీ వీసాదారులు కూడా వెంటనే వెనక్కు తిరిగి రావాలని ఆదేశించింది. గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఎటువంటి కొత్త ప్రకటనా రాకముందే వారందరూ వెనక్కు తిరిగి రావాలని చెప్పింది. ఇప్పటి వరకు టెక్ కంపెనీల మాత్రమే హెచ్ 1బీ వీసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు కాలిఫోర్నియా యూనివర్శిటీ ఈ రకమైన ప్రకటన చేసి మొదటగా నిలిచింది. 

అమెరికన్లను తొలగిస్తున్న కంపెనీలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) H1B వీసా వార్షిక రుసమును లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకు పైగా) పెంచారు.  ట్రంప్ ఇలా సడెన్‌గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో అనేదానిపై చాలానే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. చాలావరకు అమెరికన్ కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి వాళ్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని తెలిపింది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై ముందుగా అమెరికన్లకే హక్కు ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ట్రంప్ చెబుతూ వస్తున్నారు. దీనికి కారణం కంపెనీల్లో ఉన్న అమెరికన్లను తొలగించి...విదేశీయలును నియమించుకోవడమే అని చెబుతోంది వైట్ హౌస్. తాజాగా ఓ కంపెనీ 16 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. ఆ కంపెనీ 5,189 H1బీ పర్మిషన్లు పొందింది. 1698 వీసా పర్మిషన్లను పొందిన మరో కంపెనీ 2400 ఉద్యోగాలను తగ్గించింది. ఇంకో కంపెనీ 25,075 H1B వీసా(h1-b-visa) అనుమతులు పొందింది. 2022 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 27 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో కంపెనీ 1137 H1బీ వీసాలు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1000 అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. అమెరికన్ ఐటీ ఉద్యోగులకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇలా ఉద్యోగంలో నుంచి తొలగించడం, అలాగే విదేశీ టెక్కీలకు శిక్షణ ఇవ్వడంపై విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసా ఫీజును పెంచినట్లు తెలుస్తోంది.  

Also Read: Canada PM Carney: ఇండియా-పాక్ మధ్య శాంతి..ట్రంప్ కు కెనడా ప్రధాని కార్నీ ప్రశంసలు..

Advertisment
తాజా కథనాలు