/rtv/media/media_files/2025/09/23/indian-railways-2025-09-23-17-29-12.jpg)
Indian Railways
భారతదేశంలో అతి ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్ళల్లో. ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నా...రైల్వే మాత్రం తగ్గడం లేదు. భారత్ లో ఎక్కువగా ఉండే మధ్యతరగతి, దిగువ తరగతి జనాలు రైళ్ళల్లోనే ప్రయాణాలు చేస్తుంటారు. రైల్వే మన ఇండియాకు ఎప్పటికీ పెద్ద సపోర్టింగ్ సిస్టమ్ గానే ఉంటుంది. అందుకే ఇందులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అండ్ భారత రైల్వే సంస్థ. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించే దిశగా కొత్త ట్రైన్లను దాంతో పాటూ కొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. గత కొంత కాలంగా రైల్వేలో గణనీయమైన మార్పులు చేసింది. తాజాగా మరో మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖాళీలు ఉంటే మార్చుకోవచ్చు..
ఇప్పటి వరకు ట్రైన్ టికెట్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని తేదీని మార్చుకునే వీలు లేదు. ప్రయాణ తేదీ మారాలంటే ఆల్రెడీ కొన్న టికెట్ ను క్యాన్సిల్ చేసుకుని..మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి. వారి ప్రయాణ తేదీ టైమ్ ఆధారంగా రీఫండ్ వస్తుంది. కానీ ఇది చాలా సార్లు ప్రయాణికులకు అసౌకర్యంగానే ఉంటుంది. మనకు కావాలనుకున్న టైమ్ కు టికెట్లు దొరకకపోవడం..ఒక్కోసారి రిఫండ్ రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అదే విమానాల్లో అయితే ఫ్లెక్సిబుల్ టికెట్ బుకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను భారత రైల్వేస్ కూడా తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన రూల్స్ మార్పుకు రైల్వేస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, వచ్చే జనవరి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానుంది. జనవరి నుంచి, ప్రయాణికులు తమకు కన్ఫామ్ అయిన రైలు టికెట్ ప్రయాణ తేదీని ఎలాంటి రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అన్యాయమైంది. ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని...అందుకే దీనిని మారుస్తున్నామని ఆయన చెప్పారు.
అయితే టికెట్ల మార్పుకు కొన్ని కండిషన్స్ మాత్రం వర్తిస్తాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తనకు బుక్ అయిన టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోచ్చు. అయితే, మార్చుకోవాల్సిన తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యపడుతుంది. కొత్త టికెట్ ధర ఎక్కువైతే, ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికుడు భరించాల్సిందే అని చెప్పారు. ప్రస్తుత నిబంధన ప్రకారం, రైలు బయలుదేరడానికి 48 నుంచి 12 గంటల ముందు బుకింగ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఛార్జీల నుంచి 25 తగ్గించి, మిగిలిన డబ్బు రీఫండ్ చేస్తారు. 12 గంటల నుంచి 4 గంటల ముందు ఛార్జ్ మరింత పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి డబ్బు తిరిగి చెల్లించబడదు.
जनवरी 2026 से भारतीय रेलवे एक बड़ा बदलाव लागू करने जा रहा है। अब यात्री बिना कोई अतिरिक्त शुल्क दिए अपनी ट्रेन टिकट की तारीख ऑनलाइन बदल सकेंगे। हालांकि, नई तिथि पर सीट की पुष्टि सीट उपलब्धता पर निर्भर करेगी। अगर नए टिकट का किराया पहले से ज्यादा होगा, तो यात्रियों को सिर्फ उतना… pic.twitter.com/ADRTFi2hKX
— News Pinch (@TheNewspinch) October 7, 2025