/rtv/media/media_files/2025/10/07/us-student-2025-10-07-08-56-21.jpg)
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా(usa) పెట్టింది పేరు. ఇక్కడ చదువుకోవడం ఖరీదైన విషయమే అయినా..చాలా మంచి విద్య, దాంతో పాటూ లైఫ్ సెటిల్ అయిపోయే ఉద్యోగాల గ్యారంటీ. అందుకే కష్టపడి అయినా సరే ఇక్కడకు వచ్చి చదువుకోవాలని అనుకుంటారు చాలా మంది. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా విద్యార్థులు వస్తారు. ఒకప్పుడు కొంచెం డబ్బులు ఉన్నవారే ఇక్కడకు చదువుకోవడానికి వచ్చేవారు. కానీ గత కొన్నేళ్ళల్లో మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు కూడా లోన్లు పెట్టుకుని చదువుకోవడానికి వస్తున్నారు. కానీ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక వీరందరి ఆశలు గల్లంతయ్యాయి.
Also Read : 4 లక్షల మంది మహిళలపై లైంగిక వేధింపులు.. పాక్ సైన్యం దుర్మార్గాలను బయటపెట్టిన భారత్!
విదేశీ విద్యార్థులపై మరో పెద్ద దెబ్బ..
ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విదేశీ విద్యార్థుల మీద ఏవో ఒక ఆంక్షలు పెడుతూనే ఉన్నారు. ముందు చదువు కోసం వచ్చే విద్యార్థులు ఇక్కడ పని చేసుకోకూడదు అని రూల్ తెచ్చారు. దాని తరువాత విద్యార్థులు ఎటువంటి రూల్స్ ను అతిక్రమించడానికి వీల్లేదన్నారు. ట్రాఫిక్ ను ఉల్లంఘించినా కూడా వీసా క్యాన్సిల్ చేసేశారు. అది అయిపోయాక విద్యార్థి వీసాలను కూడా స్ట్రిక్ట్ చేసేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా మీద నిఘా పెట్టారు. విద్యార్థులు ఎవరు ఏ మాత్రం తేడాగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా విద్యార్థుల వీసాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. దానికి తోడు రీసెంట్ గా యూనివర్శిటీలకు ప్రత్యేకమైన రూల్ పాస్ చేసింది ట్రంప్ ప్రభుత్వం. విదేశీ విద్యార్థులకు 15శాతానికి మించి యూనివర్శిటీల్లో సీట్లు ఇవ్వకూడదు అంటూ ఆంక్షలు పెట్టింది. ఒక దేశం నుంచి కేవలం 5 శాతం మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇవ్వాలి.
ఇవన్నీ అయిపోయాయి...ఇప్పుడు విదేశీ విద్యార్థుల నెత్తి మీద మరో పెద్ద పిడుగు వేసింది ట్రంప్ గవర్నమెంట్. ఓపీటీని క్యాన్సిల్ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది కనుక అమలులోకి వస్తే..చాలా మంది విద్యార్థుల భవితవ్యం అంధకారంలో పడిపోతుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు పెద్ద దెబ్బ అవుతుంది.
Also Read : పాక్ నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల తరలింపు..గుట్టు చప్పుడు కాకుండా డీల్..
ఓపీటీ అంటే ఏంటి?
అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు..చదువు అయిపోయాక వృత్తి పరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాల కిద మారడానికి ఓపీటీ పై ఆధారపడతారు. దీనిపై అక్కడ వేలాది మంది ఇప్పటికే ఆధారపడి ఉన్నారు. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. దీని ద్వారా వారు కొత్త కోర్సులు చేస్తారు. దీనిని వారు ఎఫ్ 1 వీసా మీదనే చేస్తారు . ఎఫ్-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకూ పని చేయడానికి ఓపీటీ అనుమతిస్తుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లకు అయితే ఈ గడువు మరో 24 నెలలు అదనంగా పొడిగించుకోవచ్చును. దీంతో వారు చదువు అయ్యాక కూడా మూడేళ్లు అమెరికాలో ఉండొచ్చును. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హెచ్ 1 వచ్చాక మరో ఆరేళ్లు ఉద్యోగం చేసుకోవచ్చును. అమెరికాలో చదివిన అందరికీ వెంటనే ఉద్యోగాలు వచ్చేయవు. మంచి ఉద్యోగం రావడానికి కాస్త టైమ్ పడుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఈ ట్రైనింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇది కనుక రద్దు అయితే వేలాది మంది వెనక్కు తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది జూలై-ఆగస్ట్ లో అమెరికాకు వచ్చే భారత విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. దాదాపు ఇది 50శాతంగా ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ డేటా చూపించింది. ఈ గణనీయమైన తగ్గుదల 2025-26 విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతుందని ,అంతర్జాతీయ విద్యార్థులపై ఎక్కువగా ఆధారపడే యూనివర్శిటీలు, కాలేజీలు చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుందని ఫోర్బ్స్ నివేదిక చెబుతోంది. దీనికి తోడు ఒక సర్వే ప్రకారం 54 శాతం మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమం లేకపోతే విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు మొగ్గు చూపరని తెలుస్తోంది. దీని కారణంగా విశ్వవిద్యాలయాలకు వచ్చే నిధులు తగ్గిపోతాయని చెబుతున్నారు. ADIS/I-94 ఇమ్మిగ్రేషన్ రికార్డుల ఆధారంగా US ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం, భారతదేశం నుండి విద్యార్థుల రాక 44.5% తగ్గింది. ఆగస్టు 2024లో 74,825 నుండి ఆగస్టు 2025లో 41,540కి తగ్గింది.జూలై 2024 తో పోలిస్తే జూలై 2025 రాకపోకలు కూడా 46.4% తగ్గాయి. నివేదిక ప్రకారం..ఇది 24,298 నుండి 13,027కి తగ్గాయి.