Rajasthan: హైవే పై పేలుడు..గ్యాస్ సిలెండర్ల ట్రక్కును ఢీకొన్న మరో ట్రక్కు

రాజస్థాన్ లో హైవేపై భారీ యాక్సిడెంట్ జరిగింది. గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. నిన్న అర్థరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. 

New Update
rajasthan accident

రాజస్థాన్ లోని జైపుర్‌-అజ్మేర్‌ జాతీయ రహదారి ప్రాంతమంతా దద్ధరిల్లింది. హైవేపై వెళుతున్న గ్యాస్ సిలెండర్ ట్రక్కును మరో ట్రక్కు ఢీకొంది. దీంతో గ్యాస్ సిలెండర్లు అన్నీ పేలిపోయాయి. ఈ పేలుడు కారణంగా ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. రహదారి అంతా మంటలతో అల్లకల్లోలంగా తయారయింది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర వరకూ పేలుళ్ళ శబ్దాలు వినిపించాయి. యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంఘటనా స్థలిని సమీక్షించిన ముఖ్యమంత్రి..

మంగళవారం అర్థరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. దీని కారణంగా హైవే మొత్తం ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ ఆదేశాలతో డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్‌ బైర్వా ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రెండు ట్రక్కుల్లో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు కనిపించడం లేదు. వారు బతికి ఉన్నారా..పారిపోయారా అనేది కూడా తెలియడం లేదు. వారి జాడ కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు కనిపించడం లేదని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని మాత్రం సిద్ధం చేశామని తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు