80's Stars: రీయూనియన్ చిరుత..వైరల్ అవుతున్న 80s స్టార్ల కలయిక వీడియోలు

80sలో ఓ ఊపుఊపిన దక్షిణాది నటులు రీసెంట్ గా రీయూనియన్ అయ్యారు. ఫారెస్ట్ అండ్ చిరుత థీమ్ తో ఆడుతూ పాడుతూ గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
80's stars

80ల స్టార్ ల రేంజే వేరు. మెగాస్టార్ నుంచి కామెడీ స్టార్ ల వరకూ...ప్రతీ హీరోయిన్ అప్పట్లో దుమ్ము దులిపిన వారే. అంతేకాదు. వారి మధ్య బాండింగ్ కూడా అంతే స్ట్రాంగ్. అప్పట్లో హీరో హీరోయిన్లుగా బిజీబిజీగా గడిపిన ఈ యాక్టర్లు అందరూ ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే తమ తరువాతి తరం వారికి కాస్త వెసులుబాటు కొంత మంది ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే...మరి కొంత మంది అన్నానాన్నలుగా, సినిమాలో క్యారెక్టర్ ఆరిస్ట్ లు గా తమ కెరీర్ ను మలుచుకున్నారు. కానీ వీరందరూ తమ పాత తీపి జ్ఞాపకాలను మాత్రం నెమరేసుకుంటూనే ఉన్నారు. గత 12 ఏళ్ళుగా 80s స్టార్స్ ప్రతీ ఏడాది కలసి రెండు , మూడు రోజులు గడపడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. సౌత్ కు సంబంధించిన నాలుగు భాషల యాక్టర్లు ఇందులో పాల్లోంటూ వస్తున్నారు.

80ల చిరుతలు..

తాజాగా ఈ 80s మహానటుల రీయూనియన్ జరిగింది. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా తమ రీ యూనియన్ కు ఒక థీమ్ ను పెట్టుకున్నారు. ఫారెస్ట్ లేదా చిరుత థీమ్ తో తెగ ఎంజాయ్ చేశారు. ఈ కలయికకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నరేష్, సురేష్, జాకీ ష్రాఫ్, మలయాళ నటుడు జయరామ్, సుహాసిని, రేవతి, కుష్బూ, రమ్యకృష్ణ, లిజి, నదియా, శరత్ కుమార్, రాజ్ కుమార్ సేతుపతి, సుప్రియ, జయసుథ, సుమలత, శోభన లతో పాటూ మరి కొందరు పాల్గొన్నారు. ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు