/rtv/media/media_files/2025/10/07/parvataneni-2025-10-07-10-47-11.jpg)
Parvataneni Harish
అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా..ఇండియా మీద బురద జల్లుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా కశ్మీర్ అంశాన్ని ప్రతీ అంతర్జాతీయ వేదిక మీద లేవనెత్తుతుంది. కానీ ఇలా చేసిన ప్రతీసారి అవమానాన్నే ఎదుర్కొంటుంది. తాజాగా ఈరోజు జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలా సమావేశంలో కూడా ఇదే జరిగింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ అనేక పచ్చి అబద్ధాలు చెప్పింది.
4లక్షల మంది మహిళలపై..
ఐక్యరాజ్య సమితిలో మహిళలు, శాంతి భద్రతలపై జరిగిన చర్చల్లో పాక్ మరోసారీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. పాక్ అధికారిణి సౌమా సలీమ్ మాట్లాడుతూ..కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక గురైయ్యారంటూ ఆరోపణ చేశారు. దీనికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చాలా గట్టిగా సమాధానం చెప్పారు. తమను ఒకమాట అనే ముందు తమ సొంత దేశం ఏం చేసిందో గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు. తమ దేశంలో మహిళలు, శాంతి భద్రతలకు సంబంధించిన మార్గదర్శకాలు సరిగ్గానే ఉన్నాయని చెప్పారు. దురదృష్టవశాత్తు.. ప్రతి సంవత్సరం మన దేశానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుదారి పట్టించే ప్రసంగాలను వినవలసి వస్తుందని చెప్పారు.
కానీ పాకిస్తాన్ మాత్రం సొంత దేశంపైనే బాంబులు వేస్తూ మారణహోమానికి పాల్పడుతుందని ఆరోపించారు. మహిళలను టార్చర్ చేయడంలో పాకిస్తాన్ కు దారుణమైన రికార్డులున్నాయని హరీష్ అన్నారు. 1971లో నిర్వహించిన ఆపరేషన్ సెర్చ్ లైట్ లో పాక్ సైన్యం 4లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి అనుమతించింది. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీలను అణిచేందుకు ఈ ఆపరేషన్ ను చేశారు. లక్షల మంది మహిళలను నిర్భంధించి, దారుణంగా హింసించారు. ఈ పరిణామాలు భారత్, పాక్ యుద్ధానికి కూడా దారి తీశాయి. భారత సైన్యం పాక్‌ను ఓడించడంతో బంగ్లాదేశ్ అవతరించింది అంటూ పర్వతనేని హరీష్ పాకిస్తాన్ కు టిట్ ఫర్ టాట్ ఇచ్చారు.
#IndiaAtUN
— India at UN, NY (@IndiaUNNewYork) October 6, 2025
PR @AmbHarishP delivered India’s statement at the UNSC Open Debate on Women Peace and Security marking 25 years of Resolution 1325.
Quoting EAM @DrSJaishankar, he described women peacekeepers as “messengers of peace” and outlined India’s rich and pioneering… pic.twitter.com/SesXRFRJbU
Also Read: US-Pakistan: పాక్ నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల తరలింపు..గుట్టు చప్పుడు కాకుండా డీల్..