H-1B Visa: హెచ్ 1బీ వీసా దరఖాస్తులను ఆపేయండి..టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం

హెచ్ 1బీ వీసా దరఖాస్తుల విషయంలో వరుసగా అమెరికా రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  తాజాగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్.. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ర్టంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. 

New Update
H1b Visa

H1b Visa

హెచ్ 1బీ వీసాలను నిలిపేయాలని అమెరికాలోని మరో రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు కాలిఫోర్నియా, ఫ్లోరిడాలు హెచ్ 1బీ వీసాలను నిలిపేయాలని  ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పుడు టెక్సాస్ వంతు. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ర్టంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు టెక్సాస్ గ్రెగ్ అబాట్. 2027 వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. హెచ్ 1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని...అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అబాట్ చెప్పారు. అమెరికన్‌ ఉద్యోగాలు దేశ కార్మికులకే దక్కాలని ఆయన వ్యాఖ్యానించారు.  

2027 వరకు నో హెచ్ 1బీ వీసా..

హెచ్ 1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని తమకు నివేదికలు అందాయని గ్రెగ్ అబాట్ చెప్పారు. తమ దేశంలో ఉద్యోగాలు..అమెరికన్లకే వెళుతున్నాయని నిర్ధారించుకోవాలని..అద అయ్యే వరకు వీసా కార్యక్రమాన్ని నిలిపేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీని ద్వారా కత్త వీసా పిటిషన్లను నిలివేయాలని రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. టెక్సాస్‌ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పనిచేయాలని అబాట్‌ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులతో కూడిన ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలన్నారు.  విదేశీ ఉద్యోగులను నియమించుకుని కొందరు హెచ్ 1బీ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశారని అబాట్ ఆరోపించారు. 

కాలిఫోర్నియా తర్వాత అమెరికాలో అత్యధిక హెచ్‌-1బీ హోల్డర్లు ఉన్న రాష్ట్రం టెక్సాస్‌. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ డేటా ప్రకారం.. 2025లో 6,100 కంపెనీల ద్వారా 40వేల మందికి పైగా హెచ్‌-1బీ వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1200 మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే హెచ్ 1బీ వీసాల ఫీజు లక్ష డాలర్లకు పెంచేశారు. దాంతో పాటూ సోషల్ మీడియా స్క్రీనింగ్ ద్వారా వీసా స్లాట్లు దొరకడం లేదు. దానికి తోడు ఇప్పుడు అమెరికా రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా మంది మీద ఎఫెక్ట్ చూపించనున్నాయి. దీని వలన చాలా మంది విదేశీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 

Advertisment
తాజా కథనాలు