Imran Khan: జైల్లో క్షీణిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం..కంటిచూపు పోయే ప్రమాదం

జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన హెల్త్ రోజురోజుకూ దెబ్బ తింటోందని...కంటి చూపు పోయే ప్రమాదం ఉందని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

New Update
imran khan

పాకిస్తాన్ మాజీ ప్రధాని 2023 నుంచీ జైల్లోనే ఉంటున్నారు. ఆయనపై దేశద్రోహం, దైవదూషణ, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, అవినీతి ఇలా దేశ వ్యాప్తంగా 121 కేసులు నమోదయ్యాయి. దేశద్రోహం, దైవదూషణ, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, అవినీతి ఇలాలాహోర్ నగరంలో 12 ఉగ్రవాద కేసులు, ఫైసలాబాద్ 14 కేసులు, దేశవ్యాప్తంగా 22 ఉగ్రవాద కేసులు నమోదు చేశారు. వీటిల్లో అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ పేరున ఉన్న ‘‘అల్ ఖదీర్ట్రస్ట్’’కు రూ.53 కోట్ల విలువైన భూమని బహీరీ పట్టణంలో కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశ ఖజానాకు నష్టం కలిగించేలా చేసినందుకు ఆయన ఎన్ఏబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సంబంధిత కోర్టులో హాజరుకావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా..ఇమ్రాన్ ఖాన్ లెక్క చేయలేదని.. అందుకే అరెస్ట్ చేశామని అధికారులు చెప్పారు. ఈ కేసులో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత తోషఖానా అనే కేసులో కూ డా మూడేళ్ళ జైలు శిక్ష పడింది. 

మానాన్న పరిస్థితేం బాలేదు..

ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ను కలవనియ్యడం లేదని దేశ వ్యాప్తంగా ఆదోళనలు కూడ జరిగాయి. చాలా నెలలు ఆయనను ఎవరూ కలవకుండా కట్టుదిట్టం చేశారు. కనీసం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్పలేదు. ఇమ్రాన్ కాన్ ను కలవడానికి వెళ్ళిన ఆయన సిస్టర్స్ పై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ సొంత పార్టీ అయిన పీటీఐ నిరసనలు చేసింది. దాంతో ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ జోక్యం కల్పించుకోవాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ను బంధువులతో కలవనివ్వాలి ప్రధాని ఆదేశించారు. అయితే దీని తరువాత కూడా ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో చిత్రహింసలు పెడుతున్నారంటూ ఆయన కొడుకులు ఆరోపించారు. మా నాన్నను రెండేళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారు. ఆయనకు మురుగు నీటిని ఇస్తున్నారు. హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉంటున్నాడు. అక్కడి జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆయనకు ఎవరితో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచారు. మా నాన్నను బయటకు తీసకొచ్చేందుకు కూడా ఎలాంటి మర్గం కనిపించడం లేదని చెప్పారు. 

కంటి చూపు కోల్పోయే ప్రమాదం..

తాజాగా ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి మరో ఆందోళన వ్యక్తం అయింది. జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ కుడి కంటిలో సమస్య తలెత్తిందని, దానికి వెంటనే చికిత్స అందించకపోతే చూపుపోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశాయి. వైద్యుల సూచనను పట్టించుకోకుండా జైల్లోనే ఆయనకు చికిత్స అందించాలని జైలు అధికారులు పట్టుబడుతున్నారని ఆరోపించాయి. ఇమ్రాన్ చివరి సారిగా 2024 అక్టోబర్ లో వ్యక్తిగత వైద్యుడు దగ్గర పరీక్షలు చేయించుకున్నారు.  తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి టెస్ట్ లు జరగలేదు. కనీసం ఇప్పుడైనా ఆ డాక్టర్ ను కలిసేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు. 

Also Read: Stock Market: కలిసివచ్చిన ఈయూ డీల్.. లాభాల్లో షేర్ మార్కెట్

Advertisment
తాజా కథనాలు