BIG BREAKING: అజిత్ పవార్ మృతి వెనుక కుట్ర.. టాప్ లీడర్ల సంచలన ఆరోపణలు!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్  మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనపై టాప్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.  యాక్సిడెంట్ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
pawar

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ రోజు విమాన ప్రమాదంలో మృతి చెందారు.  జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ బారామతి వెళ్తుండగా.. అక్కడ ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపానికి గురై విమానం కుప్పకూలింది. వెంటనే మంటలు చెలరేగి..అజిత్ పవార్ తో పాటూ ఆన సిబ్బంది, పైలెట్లు అందరూ మరణించారు.

సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలి.. 

ఈఘటనపై పలువురు ముఖ్య నేతలు నేతలు స్పందించడంతో పాటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మృతి వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు.  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ..పవార్ మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురైయ్యానని అన్నారు.  ఈ ప్రమాదం దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. పవార్ బీజేపీ నుంచి వచ్చేయాలని ఆలోచిస్తున్నారని..ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ప్రచారం కూడా జరిగింది. దాని తరువాత ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని మమతా సంచలన వ్యాఖ్యలు చేశారు.  పవార్ మరణంపై సుప్రీంకోర్టు మాత్రమే దర్యాప్తు చేయాలని...తనకు మరే ఇతర దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదని కూడా దీదీ అన్నారు. దర్యాప్తు సంస్థలు వాటి స్వేచ్ఛను కోల్పోయాయని కామెంట్ చేశారు. 

సమగ్ర విచారణ జరపాలి..

సీఎం మమతా బెనర్జీతో పాటూ ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కూడా అజిత్ పవార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.  పవార్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. అజిత్ పవార్ ప్రయాణించిన ఫ్లైట్ చాలా చిన్నదని...అహ్మదాబాద్ ఫ్లైట్ లా పెద్దది కాదని...అసలది ఎందుకు కూలిందో తెలుసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. 

నిజాయితీకి మూల్యం..

ఇక  అజిత్ పవార్ అకాలమరణంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ తరుణంలో ఈ విషాదం మహారాష్ట్రకు తీరని లోటని ఎక్స్‌లో నివాళి అర్పించారు. అజిత్ పవార్ చాలా నిష్కపటమైన వ్యక్తి అని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం ఆయన నైజం కాదని థాకరే అన్నారు. అంతేకాదు రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీరందరితో పాటూ పలువురు రాజకీయ నేతలు సైతం అజిత్ పవార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఇందుకు దారితీసిన ప్రమాద ఘనటపై పారదర్శకమైన దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, వంచిత్ బహుజన్ అఘాడి నేత ప్రకాష్ అంబేద్కర్ తదితరులు కోరారు.

Also Read: Imran Khan: జైల్లో క్షీణిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం..కంటిచూపు పోయే ప్రమాదం

Advertisment
తాజా కథనాలు