/rtv/media/media_files/2025/02/01/HTkkjrXZQL0PAvufYUE1.jpg)
budget 10 points Photograph: (budget 10 points)
మరో 15 రోజుల్లో శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో 2026కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజైన జనవరి 28న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. కాగా, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న రీత్యా 13వ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులను నిర్మలా సీతారామన్ నిర్వహించినట్టు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఆర్థిక విధానాల పటిష్టత, సమ్మిళత అభివృద్ధి, మహిళా సాధికారత, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్స్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. దాంతో పాటూ పలు రంగాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతున్నాయి. 2026–27 యూనియన్ బడ్జెట్ కోసం సమర్పించిన ప్రతిపాదనల్లో, ప్రైవేటీకరణను సెక్టార్ల వారీగా అమలు చేయాలని, ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా సంస్థల సామర్థ్యం, టెక్నాలజీ, గ్లోబల్ పోటీ సామర్థ్యం పెరుగుతుందని సంస్థలు చెబుతున్నాయి.
Also Read: తెలంగాణలో కొత్త జిల్లాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
స్టార్టప్ లకు లాభం కలిగేలా..
ఇవన్నీ అలా ఉంచితే ఈ సారి కేంద్ర బడ్జెట్ లో యువత మీద ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మధ్య తరగతి వారికి కూడా ఉపశమనం కలిగించే అంశాలుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా అప్పులు, పన్నుల విషయంలో వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. యవత స్టార్టప్ లకు ఉపయోగపడేలా...వారు మరిన్ని వ్యాపారాలు ప్రారంభించేలా కేంద్రం అప్పులు విషయంలో మార్పులు చేయనుంది. దీని కోసం మరింత ఈజీగా అప్పులు దొరికే విధంగా నిబంధనలను సరి చేయనున్నట్లు చెబుతున్నారు. బడ్జెట్ మద్దతు వాస్తవ వ్యాపార ఫలితాలతో ముడిపడి ఉండాలని ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ఎమోబి CEO భరత్ కృష్ణారావు అన్నారు. దానికి తగ్గట్టు బడ్జెట్ లో మార్పులు చేయాలని సూచించామని తెలిపారు. స్టార్టప్‌లకు సబ్సిడీలను విస్తరించడం, లక్ష్య మద్దతును అందించడం వల్ల తయారీ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా చిన్న, అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు ఇటు వంటి చర్యలు తమ స్కేల్ ను పెంచుకునే అవకాశాన్నిస్తాయని తెలిపారు.
Also Read: గంటలో అంతా తారుమారు..చివర్లో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్
ప్రారంభ దశ స్టార్టప్‌లకు మెరుగైన ప్రోత్సాహకాలు, సరళీకృత సమ్మతి నిర్మాణాలు, ప్రభావ ఆధారిత వెంచర్‌లకు నిధులు, గ్రాంట్లకు మెరుగైన ప్రాప్యత కోసం చిన్న కంపెనీలు ఎదురు చూస్తాయి. దాంతో పాటూ పన్ను ప్రయోజనాలు కూడా వారికి ఉపయోగపడాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించాలని పేరెంట్‌వర్స్ వ్యవస్థాపకుడు, CEO అభినవ్ రావు కూచిపూడి అన్నారు. రాబోయే బడ్జెట్‌లో బాల్య అభివృద్ధి, మానసిక ఆరోగ్యం, డిజిటల్-ఫస్ట్ పేరెంటింగ్ సొల్యూషన్స్ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. వీటన్నింటితో పాటూ పన్ను పరిమితులను కూడా పెంచాలని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితిని రూ.20 లక్షల నుంచి కూ. 1 కోటికి పెంచాలని సూచిస్తున్నారు.
Also Read: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే ?
పన్నుల భారం తగ్గింపు..
ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు ప్రాథమిక పన్నుతో పాటు సర్‌చార్జ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆదాయం ఉంటే - 10% సర్‌చార్జ్ ఉంది. ఇక రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లు వరకు - 15%, రూ.2 కోట్లు నుంచి రూ.5 కోట్లు వరకు - 25%, రూ.5 కోట్లు దాటితే - కొత్త పన్ను విధానంలో 25%, పాత విధానంలో 37% సర్‌చార్జ్ గా అమలవుతుంది. ఇప్పటికే ఈ స్థాయిలో పన్ను భారం ఉండటంతో, మరింత పెంపు చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. డెలాయిట్ నిపుణుడు అలోక్ అగర్వాల్ ప్రకారం.. ప్రభుత్వం ఇప్పటికే 2023లో గరిష్ఠ సర్‌చార్జ్‌ను 37% నుంచి 25%కు తగ్గించింది. ఇంత తక్కువ సమయంలోనే మళ్లీ పన్ను భారం పెంచడం రాజకీయంగా, ఆర్థికంగా సాధ్యపడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా విశ్లేషణల ప్రకారం.. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం పన్నులు పెంచడం కంటే పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే విధానాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు.
పెన్షన్లు...
అలాగే ఈ సారి బడ్జెట్ లో ఈసారి బడ్జెట్‌లో వృద్ధులకు కొంత ఉపశమనం కలిగించే ప్రకటనలు ఉండవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెన్షన్‌లు, పన్ను మినహాయింపులు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కీలక మార్పులు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. 70–75 సంవత్సరాలు, 75 ఏళ్లు పైబడిన వారికి వేర్వేరు పెన్షన్ స్లాబ్‌లు అమలు చేయవచ్చని అంటున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం కనీస పెన్షన్‌ను నెలకు రూ.7,500 నుంచి రూ.9,000 వరకు పెంచాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పెన్షన్‌తో పాటు వృద్ధులకు పన్ను ఉపశమనం అంశం కూడా బడ్జెట్‌లో కీలకంగా ఉండొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం 60–79 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు ఉంది. అయితే ఆరోగ్య ఖర్చుల భారం దృష్ట్యా ఈ పరిమితులను పెంచే అవకాశాన్ని పరిశీలించవచ్చని సూచనలు వస్తున్నాయి.
Also Read: Explainer: వెనిజులా విషయంలో పుతిన్ అందుకే సైలెంట్గా ఉన్నాడా?
Follow Us