Ajith Pawar Plane Crash: ప్రాణాలు తీసిన రెండు తప్పులు..అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో నిజాలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ పై డీజీసీఏ ప్రాథమిక నివేదిక సమర్పించింది.   రెండు తప్పులు కారణంగానే విమాన కుప్ప కూలిపోయిందని సీనియర్ పైలెట్లు చెబుతున్నారు.  రన్ వే ను గుర్తించడంలో జరిగిన తప్పు వల్లనే ఈ సంఘటన జరిగిందని అంటున్నారు. 

New Update

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదాన్ని సీనియర్ పైలెట్లు విశ్లేషస్తున్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపై వివరాలను చెబుతున్నారు. ఈ ప్రమాదానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడుతున్నాయని తెలిపారు. పవార్ విమానం ప్రమాదానికి గురైన ప్రదేశ్ బారామతి ఎయిర్ పోర్ట్ టేబుల్ టాప్ రన్ వే ఉంటుందని చెప్పారు. అంటే కొండపైన లేదా ఎత్తైన ప్రదేశంలో ఉంటే ర్ వే. సాధారణంగా ఇలాంటి చోట్ల విజిబులిటీ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని గుర్తించడం కష్టం. ఎక్కడ స్టార్ అవుతుందో క్లియర్ గా తెలియదు. దీని కారణంగా చాలా జాగ్రత్తా విమానాన్ని ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం చిన్న మిస్టేక్ జరిగినా..ఫ్లైట్ లోయలో పడే ఛాన్సెస్ ఉంటాయని సీనియర్లు చెబుతున్నారు. అలాగే ల్యాండ్ అయ్యే సమయంలో ఫ్లైట్ వేగాన్ని కూడా ఫుల్ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి. పవార్ విమానం ఉండాల్సిన వేగం కన్నా ఎక్కువ వేగంతో దిగిందని...దాని కారణంగా బ్యాలెన్స్ తప్పి నేలకు గుద్దుకుందని విశ్లేషిస్తున్నారు. అందుకే ల్యాండ్ అయిన వెంటనే విమానం కూలిపోవడంతో పాటూ మంటలు అంటుకుని కాలిపోయిందని చెబుతున్నారు. 

రీడ్ బ్యాక్ చేయలేదు..

ఇదిలా ఉంటే అజిత్ పవార్ విమాన ప్రమాదం గురించి మాట్లాడుతూ విమానయనాశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రీడ్ బ్యాక్ అనే పదాన్ని వాడారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు రీడ్ బ్యాక్ చేయలేదని చెప్పారు. ప్రమాదానికి 12 నిమిషాల ముందే ఫ్లైట్ రేడియో సిగ్నళ్ళు నిలిపివేసింది.  వీటి ద్వారా ఎప్పటికప్పుడు విమానం లొకేషన్‌, వేగం తెలుస్తుంది. దీంతో పవార్ ప్రయాణించిన విమానం తాలూకా ఇన్ఫర్మేషన్ ఏవియేషన్ అధికారులకు సరిగ్గా తెలియలేదు.  రీడ్‌బ్యాక్‌ (Readback) అనేది ఒక  ప్రొటోకాల్‌.. అందులో సందేశం ఏమీ ఉండదు. అయితే ల్యాండింగ్‌కు సంబంధించి అధికారిక అనుమతిని పొందే సమయంలో దీనిని వాడతారు. రీడ్‌బ్యాక్‌ అంటే ఒక సందేశాన్ని మళ్లీ చదవడమే. ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సమన్వయం సరిగ్గా ఉండేట్లు చేస్తుంది.  ల్యాండింగ్ లో ఇది చాలా కీలకం. ఇదే పవార్ విమాన ప్రమాదంలో మిస్ అయింది. ఏటీసీ వాళ్ళు అందించిన సమాచారాన్ని పైలెట్లు అందుకోలేక పోయారు. దాంతో వాళ్ళకు కనిపించట్టుగా విమానాన్ని రన్ వేపై దింపడానికి ప్రయత్నించారు. అది కాస్తా సరిగ్గా జరగక మొత్తానికే ఫ్లైట్ కూలిపోయింది. తాజా ఘటనలో లియర్‌జెట్ పైలట్ శాంభవి పాఠక్.. ఈ రీడ్‌బ్యాక్‌ ఇవ్వలేదు. రన్‌వే కనిపిస్తుందా? లేదా అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడిగారని, కనిపించడం లేదనే సమాధానం వచ్చిందన్నారని మంత్రి రామ్మోహన్ నాయడు తెలిపారు. రన్ వే సరిగ్గా కనిపిస్తోందని పైలెట్లు చెప్పడంతో ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పారు. 

Also Read: H-1B Visa: హెచ్ 1బీ వీసా దరఖాస్తులను ఆపేయండి..టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు