TG Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వివాహితతో సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి ఆమె భర్త చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికేవారి రమేష్ హత్యకు గురయ్యాడు.
వివాహితతో సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి ఆమె భర్త చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికేవారి రమేష్ హత్యకు గురయ్యాడు.
క్లబ్లులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండని సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. నేడు ఢిల్లీలో జరిగిన సీఎంల భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలోని వ్యాఖ్యలపై మండిపడ్డారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
రేవంత్ రెడ్డి ముసుగు వీడి, నిజం తేటతెల్లమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని విమర్శించారు. తెలంగాణ నిధులు రాహుల్ గాంధీకి, తెలంగాణ నీళ్లు చంద్రబాబుకి కట్టబెట్టారని ఆరోపించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం స్థానిక సంస్థల స్థానాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్‌లు, 566 జడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీలు, 566 ఎంపీపీ స్థానాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. హైదరాబాద్‌లో జీఆర్ఎంబీ, అమరావతిలో కేఆర్ఎంబీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు జూలై 23న ఉద్యమం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి గంప గుత్తగా ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.