/rtv/media/media_files/2025/11/01/hyderabad-metro-services-revised-2025-11-01-17-50-19.jpg)
Hyderabad Metro services revised
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు జరగనున్నాయి. నవంబర్ 3 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంటుందని తెలిపింది. అన్ని టెర్మినెల్స్‌కు ఈ ప్రయాణ సదుపాయం వర్తిస్తుందని పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యం కోసమే మెట్రో సమయాల్లో మార్పులు సవరించినట్లు స్పష్టం చేసింది.
Revised Metro Timings | Effective 03 Nov 2025
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 1, 2025
Metro services will now run from 6:00 AM to 11:00 PM from all terminal stations on all days of the week
We request passengers to plan their travel accordingly.
Thank you for your cooperation.
[Hyderabad Metro, L&T Hyderabad… pic.twitter.com/BJlsnUSnIw
Also Read: 2025లో జరిగిన తొక్కిసలాట ఘటనలు.. 100 మందికి పైగా బలి
ప్రయాణికులు ఈ కొత్త సమయాలకు అనుగుణంగా తమ ప్రణాళికలను రూపొందించుకోవాలని కోరింది. ప్రస్తుతం చూసుకుంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో ప్రయాణాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలు, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే నవంబర్ 3 నుంచి ఈ టైమింగ్స్ మారనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మెట్రో ప్రయాణం అందుబాటులో ఉండనుంది.
Also Read: ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టిన భార్య..శ్రీశైలం డ్యాంలో శవం
Follow Us