/rtv/media/media_files/2025/11/01/2025-stampede-incidents-1-2025-11-01-17-18-01.jpg)
2025 Stampede Incidents
2025.. ఒక విషాద ఏడాదిగా చెప్పుకోవాలి. ఎన్నడూ లేనంతగా.. ఈ సంవత్సరం భారతదేశంలో తొక్కిసలాట ఘటనలు విపరీతంగా చోటుచేసుకున్నాయి. రాజకీయ సభలు, ఆధ్యాత్మిక వేడుకలు, మతపరమైన ఉత్సవాలు, క్రీడా విజయోత్సవాల సంధర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనల్లో వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Also Read : ప్రశాంత్ కిషోర్‌కు బిగ్ షాక్.. బిహార్ ఎన్నికల్లో గెలిచేది వాళ్లే.. సర్వేలో సంచలన విషయాలు
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల వద్ద
ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి చాలా ఫేమస్. రోజుకు కొన్ని వేల మంది భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇందులో భాగంగానే జనవరి 8వ తేదీన ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు గాయపడ్డారు.
కుంభమేళా దుర్ఘటన
ఈ ఏడాదిలో అతి పెద్ద తొక్కిసలాట ఏదన్నా ఉంది అంటే అది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా దుర్ఘటనే అని చెప్పాలి. మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేసేందుకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 30కి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన జనవరి 29న జరిగింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15వ తేదీని భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 18 మంది మృతి చెందారు.
గోవాలోని శిర్గావ్ ఆలయ జాతరలో
మే3వ తేదీన గోవాలోని బిచోలిమ్ తాలూకా శిర్గావ్ గ్రామంలో ఘోరమైన తొక్కిసలాట ఘటన జరిగింది. శ్రీ లైరాదేవి ఆలయంలో వార్షిక ‘‘లైరాయ్ జాతర’’ ఏర్పాటు చేయగా.. లక్షలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దీంతో రద్దీ కారణంగా గందరగోళం కావడంతో తొక్కిసలాట జరిగి 7మంది ప్రాణాలు విడిచారు. 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ
బెంగళూరులో RCB విజయోత్సవ వేడుకల్లో
ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ జట్టు గెలుపొందింది. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత మొదటిసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుక ఏర్పాటు చేసింది. ఫ్రీ టికెట్ కావడంతో అభిమానులు తండోపతండాలుగా చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట(RCB Stampede) జరిగి దాదాపు 11 మంది అభిమానులు మరణించారు. ఈ ఘటన జూన్ 4వ తేదీన జరిగింది.
కరూర్ విజయ్ రాజకీయ ర్యాలీలో
తమిళనాడు నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ థళపతి ‘తమిళగ వెట్రి కళగం’ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ జిల్లాలో రాజకీయ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఘోరమైన తొక్కిసలాట ఘటన జరిగింది. అధిక జనభా రావడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
శ్రీకాకుళం, కాశీబుగ్గ ఆలయంలో
శ్రీకాకుళం జిల్లా(Srikakulam Stampede) కాశీబుగ్గలో ఇవాళ (నవంబర్ 1) దారుణమైన తొక్కిసలాట(Kashibugga Stampede) ఘటన జరిగింది. ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివెళ్లారు. దీంతో భక్తుల రద్ధీ ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగి.. దాదాపు 9 మంది ప్రాణాలు విడిచారు.
మొత్తంగా 2025 ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 100 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Follow Us