/rtv/media/media_files/2025/10/28/aadhaar-new-rules-2025-2025-10-28-07-09-01.jpg)
Aadhaar New Rules
ఆధారు కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. భారతదేశం అంతటా ఆధార్ కార్డుదారులకు అనేక ముఖ్యమైన మార్పులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. UIDAI కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది. దీని ప్రకారం.. ప్రజలు ఇప్పుడు వారి ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు. తమకు సంబంధించిన అప్డేట్‌లు చేసుకోవచ్చు.
Aadhaar New Rules 2025
ఆధార్ కార్డు దారులు తమ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు UIDAI కొత్త వ్యవస్థ కల్పించింది. ఇప్పటివరకు కార్డుదారులు ప్రతిచోటా ఉన్న ఆధార్ సెంటర్లలో ఈ పనిని పూర్తి చేసేవారు. ఆ సమయంలో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఒక పనికోసం కొన్ని రోజులపాటు వెయిట్ చేసేవారు. దీనికోసం ప్రజల సమయం, డబ్బు వృధా అయ్యేది.
అయితే ఇప్పుడు కార్డుదారులు తమ పని కోసం ఆధార్ నమోదు కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటి దగ్గర నుంచే ఆధార్ సేవలను వేగంగా, మరింత సురక్షితంగా చేయడమే UIDAI కొత్త మార్పుల లక్ష్యం.
ప్రభుత్వ పత్రాలు అవసరం
UIDAI కొత్త వ్యవస్థ ప్రకారం.. కార్డుదారులు ఏవైనా అప్డేట్‌ల కోసం ప్రభుత్వంతో అనుసంధానించబడిన గుర్తింపు డాక్యుమెంట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సహా మరికొన్ని డాక్యుమెంట్స్ ఉపయోగించి అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వంతో అనుసంధానించబడిన గుర్తింపు పత్రం లేకపోతే.. జరగాల్సిన పని మధ్యలోనే ఆగిపోతుంది. ఇది మాత్రమే కాకుండా.. నమోదు కేంద్రాలలో ఫీజు సవరించారు. కార్డుదారులు వారి సౌలభ్యం కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఆధార్ - పాన్ ఇంటర్‌లింక్ తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం డిసెంబర్ 31, 2025 నాటికి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఒకవేళ అలా చేయకపోతే జనవరి 1, 2026 నుండి పాన్ కార్డ్ చెల్లదు. ఇంకా KYC ప్రక్రియను ఇప్పుడు మరింత ఈజీ చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు OTP, వీడియో KYC లేదా ఫేస్ టు ఫేస్ సమావేశాల ద్వారా గుర్తింపు వెరిఫికేషన్‌ను నిర్వహించవచ్చు.
ఆధార్ ఫీజులో ఎలాంటి మార్పులు
జనాభా అప్డేట్ (పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్, ఇమెయిల్): రూ. 75
బయోమెట్రిక్ అప్‌డేట్ (వేలిముద్ర, ఐరిస్ స్కాన్, ఫోటో): రూ. 125
5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నాటక అప్డేట్‌లు
డాక్యుమెంట్ అప్‌డేషన్: కేంద్రాలలో రూ. 75, జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితం.
ఆధార్ కార్డు ప్రింట్: రూ. 40
మీరు మీ ఆధార్ కార్డును ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే.. అదే చిరునామాలో మొదటి సభ్యునికి రూ. 700, అదనపు ప్రతి సభ్యునికి రూ. 350 అదనంగా చెల్లించాలి.
Follow Us