/rtv/media/media_files/2025/11/01/private-colleges-in-telangana-to-close-from-november-3-2025-11-01-18-31-40.jpg)
Private colleges in Telangana to close from November 3
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో నేటితో డెడ్‌లైన్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వానికి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి.
Also Read: ప్రయాణికులకు అలెర్ట్.. హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు
2024-25 విద్యా సంవత్సరానికి గానూ పెండింగ్‌లో రూ.9 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో దసరాకు రూ.1200 కోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే మిగిలిన రూ.900 కోట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మిగతా బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంద్‌కు పిలుపునిచ్చాయి. సమస్య పరిష్కరం పరిష్కారం కాకపోతే 'ఛలో హైదరాబాద్' చేపడతామని హెచ్చరించాయి.
Also Read: జీహెచ్ఎంసీలో దారుణం..పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగికదాడి
Follow Us