/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t065241069-2025-11-02-06-53-15.jpg)
Land donation worth Rs. 5 crore to Saraswati Vidyapeeth
Saraswati Vidyapeeth : రూ.5 కోట్ల విలువచేసే 2.7 ఎకరాల భూమిని ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని సరస్వతీ విద్యాపీఠం ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి 2.7 ఎకరాల వ్యవసాయ భూమిని ట్రస్టుకు విరాళంగా రాసిచ్చారు. ఈ మేరకు శనివారం హత్నూర రెవెన్యూ కార్యాలయంలో ట్రస్టు పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.
అనంతరం ఆ పత్రాలను సరస్వతీ విద్యాపీఠం రాష్ట్ర సంఘటన్ కార్యనిర్వాహక కార్యదర్శి పతకమూరి శ్రీనివాసులు, కార్యదర్శి వెంకటలక్ష్మికి అందజేసినట్లు తెలిపారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. కేవలం విద్యతోనే సమ సమాజ నిర్మాణం సాధ్యమనే విషయాన్ని గుర్తించి.. విలువలతో కూడిన విద్యనందించే సరస్వతీ విద్యాపీఠానికి హత్నూర సమీపంలోని తన భూమిని విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్
 Follow Us