Wife Kills Husnband: ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టిన భార్య..శ్రీశైలం డ్యాంలో శవం

వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య కడతేర్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు.

New Update
Wife who killed husband with boyfriend

Wife killed husband with boyfriend

వనపర్తి జిల్లా(vanaparthi-district)లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య కడతేర్చింది(wife-killed-her-husband). వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబరు 28న జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ కలిసి కుట్ర పన్ని కురుమూర్తిని చంపి, అనంతరం సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కారులో శ్రీశైలం వెళ్లి డ్యాంలో మృతదేహాన్ని పడేశారు. వనపర్తి రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు.

Also Read :  తొక్కిసలాట ఘటన కలచివేసింది..ఆలయ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

Wife Killed Husband With Boyfriend

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి పట్టణంలోని గణేశ్‌నగర్‌లో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు.  కురుమూర్తి ఒక మాల్‌లో వాచ్‌మేన్‌గా పని చేస్తున్నాడు. అయితే అక్టోబరు 25 నుంచి కురుమూర్తి కనిపించడం లేదని ఆయన సోదరి చెన్నమ్మ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వనపర్తి ఎస్సై శశిధర్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

కురుమూర్తి భార్య నాగమణి మెట్‌పల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. అయితే ఈ విషయం కురుమూర్తికి తెలిసింది. దీంతో ఆయన నాగమణిని మందలించాడు. దీంతో వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కుట్రపన్ని కురుమూర్తిని హత్య చేశారు. అనంతరం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ పేరిట వనపర్తిలో కారును అద్దెకు తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం డ్యాంలో పడేశారు. చెన్నమ్మ అనుమానంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నాగమణి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ దారుణ హత్య కేసు వనపర్తిలో సంచలనం రేపింది. భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read:Pakistan: నీటికొరతతో పాకిస్తాన్ పాట్లు..సింధునది జలాలు లేక తీవ్ర నష్టం

Advertisment
తాజా కథనాలు