/rtv/media/media_files/2025/11/01/cm-revanth-cabinet-2025-11-01-10-38-21.jpg)
తెలంగాణ కాంగ్రెస్(telangana-congress) ప్రభుత్వంలో త్వరలో భారీ మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలో కేబినెట్(Telangana Cabinet)లో భారీ ప్రక్షాళన జరగబోతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అయిన నేపథ్యంలో, పనితీరు బాగోలేని మంత్రులపై వేటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read : ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టిన భార్య..శ్రీశైలం డ్యాంలో శవం
భారీ ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధం
ముఖ్యమంత్రి త్వరలో కేబినెట్‌లో భారీ ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. పాత మంత్రుల్లో కొందరిని తప్పించి, కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు పలువురి శాఖల్లోనూ భారీ మార్పులు చేయనున్నట్టుగా సమాచారం, కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు డిసెంబర్ లేదా జనవరిలో ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఐదుగురు మంత్రుల తీరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
వీరి పనితీరుపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం, వీరిపై వేటు వేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేబినెట్‌లోకి కొత్తగా వచ్చిన మంత్రులకు మాత్రం ఈ ప్రక్షాళన నుంచి మినహాయింపు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరచడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం, రాబోయే ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయడమే ఈ ప్రక్షాళన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. మంత్రుల పనితీరును సమీక్షించిన తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పులు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : నిజామాబాద్ జిల్లాలోదారుణం..రోడ్డుపక్కనే మహిళ హత్య
Follow Us