TG: పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు..40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
సంక్రాంతి పండుగకు రిజర్వేషన్ చేయించుకోవాలనుకున్న ఏపీ వారికి నిరాశే మిగిలింది.నగరంలోని ముఖ్యమైన కాచిగూడ స్టేషన్ నుంచి వెళ్లే అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్లు కనపడుతున్నాయి. దీంతో పండుగ రోజులైన జనవరి 13, 14, 15 తేదీల్లో టిక్కెట్లు దొరకని పరిస్థితి.
స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోప్రక్షాళన జరగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రుల పనితీరును అంచనా వేసి, కేబినెట్లో కీలక మార్పులు ఉంటాయని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట చెల్లింది. కొత్తగా వైన్ షాపులను దక్కించుకున్న యజమానులు ఎమ్మెల్యే సూచనలను అక్షరాలా అమలు చేస్తూ, గ్రామాలకు దూరంగా ఊరి బయటే షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా, విక్రయాల సమయాన్ని కూడా కుదించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో? అంటూ తెలంగాణ ఉద్యమానికి లింక్ చేసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు.
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వారు తమదైన హామీలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు. తమను గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలు కల్పించింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని వినియెగించుకుంటోంది. తాజాగా వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రతిపక్షాలను ఫుట్బాల్ అడుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి త్వరలో అర్జెంటీనా ఫుట్బాల్ జాతీయ జట్టు కెప్టెన్, స్టార్ లియోనెల్ మెస్సీతో తలపడనున్నారు. దీనికోసం ఆయన తీవ్రంగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.