/rtv/media/media_files/2025/08/11/komatireddy-2025-08-11-18-53-58.jpg)
మునుగోడు(munugodu-politics) నియోజకవర్గంలో మద్యం దుకాణాల(wine-shops) నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(mla komatireddy rajagopal reddy) మాట చెల్లింది. కొత్తగా వైన్ షాపులను దక్కించుకున్న యజమానులు ఎమ్మెల్యే సూచనలను అక్షరాలా అమలు చేస్తూ, గ్రామాలకు దూరంగా ఊరి బయటే షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా, విక్రయాల సమయాన్ని కూడా కుదించారు. వైన్ షాపులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే తెరవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే పర్మిట్ రూమ్‌లలోకి వినియోగదారులను అనుమతించడం వంటి కఠిన నియమాలను వ్యాపారులు అమలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మద్యం దుకాణాలకు టెండర్లు వేసే సమయంలోనే వ్యాపారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రధానంగా, బెల్ట్ షాపులను నిర్వహించవద్దని, వ్యాపారులు సిండికేట్ కాకూడదని, మద్యం విక్రయాలు ఊరి బయటే జరగాలని, అలాగే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న వ్యక్తులే వైన్స్ టెండర్లు వేసేలా ప్రోత్సహించడం ద్వారా ఆయన తన నియంత్రణను సులభతరం చేసుకున్నారు.
Also Read : పవన్ కల్యాణ్ తలతిక్క మాటలు మానుకో.. సినిమాలు ఆడనివ్వం.. తెలంగాణ మంత్రుల ఫైర్
మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే
మద్యం దుకాణాలు దక్కించుకున్న తర్వాత, రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వైన్ షాపులను మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే తెరవాలని, సాయంత్రం ఆరు గంటల నుంచి మాత్రమే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని బెల్ట్ షాపులకు మద్యం విక్రయించవద్దని కచ్చితమైన సూచనలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పెట్టిన షరతులకు వ్యాపారులంతా అంగీకరించారు. ఇందులో భాగంగా, నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సోమవారం నాడు ఊరి బయటే ఏర్పాటు చేసిన మద్యం షాపులను ప్రారంభించి, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విక్రయాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే పట్టుదల కారణంగా నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై నియంత్రణ, సమయపాలన అమలులోకి వచ్చినట్లయింది.
Also Read : ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ ప్రాక్టీస్..13న మెస్సీతో బిగ్ ఫైట్
Follow Us