Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలు కల్పించింది. ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయడానికి వారిని వినియెగించుకుంటోంది. తాజాగా వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది.

New Update
FotoJet - 2025-12-02T100303.256

Telangana government.. Jobs for transgenders in metro stations..

Transgenders : ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలు కల్పించింది. ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయడానికి వారిని వినియెగించుకుంటోంది. తాజాగా వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు కలిపించడానికి ఓ కార్యాచరణను సిద్ధం చేసింది. కూడళ్లు, రద్దీ ఏరియాల్లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతు న్నాయి. ఇటీవల కాలంలో ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు.  ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందుకు కలిగిస్తోంది. అయితే దీని నివారణకు గాను వారికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సమస్యను నివారంచవచ్చని తలిచి వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది.

Also Read: పర్యాటకులకు గుడ్‌ న్యూస్‌..స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం..దీని ప్రత్యేకతలివే..

Jobs For Transgenders In Hyderabad Metro Stations

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు రంగాల్లో  ట్రాన్స్‌జెండర్లకు చేయూతనిస్తున్నది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోస్టేషన్ల(hyderabad metro station)లో  కూడా పనిచేసేందుకు అవకాశం కల్పించడం గమనార్హం. ఈ మేరకు ఎంపిక చేసిన స్టేషన్లలో 20 మంది సిబ్బంది ఈ రోజు (సోమవారం) విధుల్లో చేరారు. కాగా మెట్రో రైలు(Hyderabad Metro) ద్వారా రోజూ సుమారు 5 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో మహిళలు సుమారు 30 శాతం మంది ఉంటారు. ఈ క్రమంలో వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది ట్రాన్స్‌జెండర్‌ సిబ్బందిని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ(security) విభాగం లో నియమించడం గమనార్హం. వీరంతా స్కానర్‌(Scanner) కార్యకలాపాలు, స్ర్టీట్‌-లెవెల్‌, కాన్‌కోర్స్‌ భద్రత విధులను నిర్వర్తిస్తారని అధికారులు వివరించారు.

Also Read: క్రైం కేసుల ఛేదనలో డిటెక్టివ్‌లుగా నల్లులు..!

దేశంలో గతంలో ట్రాన్స్​జెండర్లు ఉద్యోగాలు చేసే వారు కాదు. చాలా మంది చదువుకు దూరమై.. యాచిస్తూ జీవనం సాగించేవారు. అయితే ఇటీవల ప్రభుత్వాలు, ఎన్జీవో (NGO)ల సాయంతో ట్రాన్స్​జెండర్లు సైతం చదువుకొని కొలువులు సాధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరుతున్నారు. ట్రాఫిక్​ పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Also Read: Elon Musk: నా భార్యకు భారతీయ మూలాలు, కోడుకు పేరు అశోక్..ఎలాన్ మస్క్

రాష్ట్రంలో చాలా మంది ట్రాన్స్​జెండర్లు యాచిస్తూ జీవనం సాగిస్తారు. ఎక్కువగా రైళ్లలో అడుక్కుంటారు. అయితే వీరు ప్రజలను వేధిస్తారనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే నానా హంగామా చేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, షాప్​ ఓపినింగ్​ సమయంలో హిజ్రాలు వచ్చి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తారు. ఇవ్వకపోతే రచ్చ రచ్చ చేస్తారు. ఇటీవల హైదరాబాద్​లో గృహ ప్రవేశానికి రూ.50 వేలు డిమాండ్​ చేశారు. సదరు ఇంటి యజమాని ఇవ్వకపోవడంతో అతడిపై దాడి చేశారు. ఇలా చాలా సందర్భాల్లో ట్రాన్స్​జెండర్లు ప్రజలు ఇచ్చింది తీసుకోకుండా.. వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ట్రాన్స్​జెండర్లకు ప్రభుత్వాలు, వివిధ సామాజిక సంస్థలు వారికి శిక్షణ ఇచ్చి, కొలువులు ఇస్తుండటంతో వారి వేధింపులు ఇకమీదట ఆగుతాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Also Read: Cricket: రో-కో, గంభీర్ ల మధ్య దూరం..ఈ రోజు బీసీసీఐ సమావేశం

Advertisment
తాజా కథనాలు