TG Politics: టీకాంగ్రెస్ లో కీలక పరిణామం.. ఆ 5గురు మంత్రులకు సర్పంచ్ ఎన్నికల గండం?

స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోప్రక్షాళన జరగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రుల పనితీరును అంచనా వేసి, కేబినెట్‌లో కీలక మార్పులు ఉంటాయని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

New Update
telangana cabinbet

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రివర్గంలోప్రక్షాళన జరగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రుల పనితీరును అంచనా వేసి, కేబినెట్‌లో కీలక మార్పులు ఉంటాయని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. రెండు ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రులను కూడా తప్పించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రచారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం  ఏంటంటే...  కోమటిరెడ్డి బ్రదర్స్‌(Komatireddy Brothers)కు సంబంధించినది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏఐసీసీ (AICC) లోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రణాళిక వేస్తున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక మంత్రి పొన్నం స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ కు కేబినేట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నంకు ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది. ఇక పీసీసీ చీఫ్ గా మంత్రి శ్రీధర్ బాబుకు ఛాన్స్ ఇస్తారని అంతేకాకుండా ఆయనకే హోంమంత్రిగానూ అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఆలోచనలో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. 

Also Read :  ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం సీఎం రేవంత్‌ ప్రాక్టీస్‌..13న మెస్సీతో బిగ్‌ ఫైట్‌

సీనియర్లలో కొందరిని తప్పించేందుకు

ఖాళీగా ఉన్న రెండు మంత్రి స్థానాలతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న సీనియర్లలో కొందరిని తప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు స్థానంలో ప్రేమ్ సాగర్ రావును మంత్రిగా నియమించబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద, స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణ కేబినెట్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉందని, మంత్రుల పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి నియోజకవర్గాల్లో పార్టీ సాధించిన విజయాల ఆధారంగా ఈ ప్రక్షాళన ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. - TG Politics

Also Read :  మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు..

Advertisment
తాజా కథనాలు