/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t081159731-2025-12-02-08-12-44.jpg)
CM Revanth Reddy: ప్రతిపక్షాలను ఫుట్‌బాల్ అడుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి త్వరలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జాతీయ జట్టు కెప్టెన్, స్టార్ లియోనెల్ మెస్సీతో తలపడనున్నాడు. దీనికోసం ఆయన తీవ్రంగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారుడైన మెస్సీతో రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు. దీనికోసం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ గ్రౌండ్స్‌లో సీఎం ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను తెలంగాణ సీఎంవో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
క్రీడా స్ఫూర్తి…
— Revanth Reddy (@revanth_anumula) December 1, 2025
తెలంగాణ కీర్తి…
ఈ నెల 13 న ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తో ఫుట్ బాల్ క్రీడలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ప్రారంభించాను. “తెలంగాణ రైజింగ్ - 2047” విజన్ ను క్రీడా వేదిక నుండి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచన… pic.twitter.com/kWL43FtOMB
అర్జెంటీనా ఆటగాడైన మెస్సీ ఈనెల 13న హైదరాబాద్ వస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా నగరానికి రానున్న మెస్సీ.. సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అనంతం అదేరోజు ఉప్పల్‌లో మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది. దిగ్గజ ఆటగాడైన మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం ఇప్పటి నుంచే తీవ్రమైన కసరత్తు మొదలుపెట్టడం విశేషం.
కాగా ఈ విషయాన్ని తెలుపుతూ హైదరాబాద్‌కు మెస్సీని ఆహ్వానించేందుకు, భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు సీఎం ఇటీవల ఎక్స్‌లో పేర్కొన్నారు. మెస్సీని హైదరాబాద్‌లో చూడటం అభిమానులకు ఒక ఉత్తేజకరమైన క్షణమని ఆయన పేర్కొన్నారు. తాజాగా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘క్రీడా స్ఫూర్తి.. తెలంగాణ కీర్తి. ఈ నెల 13న ప్రపంచ ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించాను. ‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగాను’’ అని సీఎం ఎక్స్‌లో చేసిన పోస్టు వైరల్ గా మారింది.
Follow Us