TG: పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు..40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ

తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.

New Update
tg

తెలంగాణలో పంచాయితీ ఎన్నిక(panchayathi-elections)ల హడావుడి నడుస్తోంది. ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువమంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. గ్రామ స్థాయి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో పలువురు సర్పంచ్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో వారు తమదైన హామీలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు. తమను గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మధ్యలోనే దిగిపోతాను అంటూప్రతినబూనుతున్నారు.

Also Read :  iBomma రవికి  పోలీసు ఉద్యోగం?

పోటీలో అధికంగా యువత ...

అయితే ఈసారి పంచాయితీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. తమ మార్క్ ను చూపించేందుకు, రాజకీయాలను మార్చేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతున్నారు. రెండు విడతగా జరిగిన నామినేషన్లలో 30-44 ఏళ్ళ మధ్యవారే ఎక్కువగా ఉన్నారు. సర్పంచ్ బరిలో 60 శాతం, వార్డు సభ్యుల్లో 75 శాతానికి పైగా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి పలువురు తమ ఉద్యోగాలను వదిలేసి మరీ పోటీకి నిల్చున్నట్టు చెబుతున్నారు. నామినేషన్ల ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. నిన్నటితో రెండు దశల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.  దీని తర్వాత పరిశీలించగా గ్రామాల్లోని యువత రాజకీయాలను మార్చేందుకు ఆసక్తిగా ఉన్నారని తేలింది. 

డిసెంబర్ 11న తొలిదశ పోలింగ్..

ఇక తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డిసెంబర్ 2వ తేదీ వరకు అంటే నిన్నటి వరకు ఈ నామినేషన్లను స్వీకరించారు. 3వ తేదీన, ఈరోజు ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. 

Also Read: Russia-Ukraine: ముందుకు సాగని చర్చలు..శాంతి ప్రణాళికకు అంగీకరించని రష్యా

Advertisment
తాజా కథనాలు