/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t124238672-2025-12-02-12-43-12.jpg)
Pawan Kalyan should stop talking nonsense..Telangana ministers fire
Pawan Kalyan Controversy: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(ap-deputy-cm-pawan-kalyan) తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. గత వారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు.. అయితే, ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజోలు నియోజకవర్గ పర్యటనలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందని.. ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో? అంటూ తెలంగాణ ఉద్యమానికి లింక్ చేసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. కాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు.
Also Read : పల్లెపోరులో హామీల వర్షం.. ఇంటికో రూ. 5లక్షల బీమా.. ఆడబిడ్డ పుడితే 5వేలు
పవన్ కల్యాణ్ తలతిక్క మాటలు మానుకో : మంత్రి వాకిటి
కాగా పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి(vakiti srihari).. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు..ఇక, రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు అని పవన్ కల్యాణ్‌కు హితవు చెప్పారు వాకిటి శ్రీహరి.. పవన్ కల్యాణ్ తలతిక్క మాటలు మానుకోవాలి.. తెలంగాణలో వనరులు వాడుకుని.. ఈ స్థాయికి ఎదిగావు.. మైలేజ్ పొందాలంటే.. పనితనం చూపించు.. కానీ, ఇలా కాదు అని సూచించారు.. ఇప్పుడు పవన్ ఇలా మాట్లాడటం సరికాదు.. అన్నదమ్ముల్లా విడిపోయాం.. కలిసుందాం అని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి..
పరిగెత్తించి కొడతాం: బల్మూరి వెంకట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర కొబ్బరికి-- తెలంగాణ దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.-- లేకుంటే తెలంగాణ నుంచి పవన్‌ను పరిగెత్తించి తరిమి కొడతాం అని హెచ్చరించారు. పవన్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలోనే ఉండాలని, -పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అతని సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమంటూ- మండిపడ్డారు.
పవన్ కల్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్(mlc-balmoor-venkat) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్ కల్యాణ్‌పై భగ్గుమన్నారు.
Also Read : ఆ నంబర్ కు ఫోన్ చేస్తే ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్ ఇదే!
సినిమాలు అడనివ్వం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(minister-komati-reddy-venkata-reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అంతేకాదు..క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా ఆడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టితగలడమేనని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ రకంగా స్పందించారు.
తెలంగాణ ప్రజల దిష్టికాదని, ఆంధ్రపాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రిగా చెబుతన్నా క్షమాపణలు చెప్పకుంటే పవన్ సినిమా తెలంగాణలో ఒక్క థియేటర్ లో కూడా విడుదల కాదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మంత్రిగా అనుభవం లేకనే ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ చేస్తున్నారన్నారు.
Also Read: Venezuela: ఆ హామీ ఇస్తే..దేశాన్ని వీడేందుకు సిద్ధం..వెనిజులా అధ్యక్షుడు మదురో
Follow Us