/rtv/media/media_files/2025/11/06/woman-suicide-due-to-fear-of-ants-2025-11-06-16-35-29.jpg)
woman suicide due to fear of ants
సాధారణంగా కొందరికి పాములంటే భయం, ఇంకొందరికి కప్పలు, తేల్లు అంటే భయం ఉంటుంది. వాటిని చూడగానే అమ్మో అంటూ పరుగులు పెడుతుంటారు. అయితే అదే భయం కొందరిలో ఫోబియాకి దారితీస్తుంది. దీని కారణంగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు పొగొట్టుకుంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ఒక వివాహితకు మైర్మేకో ఫోబియా (చీమలకు భయపడటం)(ants) ఉంది. దీని కారణంగా ఆమె తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య(married women suicide) చేసుకుంది. అనంతరం తన సూసైడ్ లెటర్‌లో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మహిళలు స్పాట్‌లోనే ..?
Woman Suicide Due To Fear Of Ants
మంచిర్యాలకు చెందిన మనీషా (25)కు మూడేళ్ల క్రితం శ్రీకాంత్‌తో వివాహం జరిగింది. వీరికి అంబిక అనే మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఉద్యోగ రీత్యా శ్రీకాంత్, మనీషా రెండున్నర ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ పరిధిలోని నవ్యా హోమ్స్‌కు షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే నివాసముంటున్నారు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలు అంటే విపరీతమైన భయం.
దీంతో ఆ భయం కాస్త ఎక్కవ కావడంతో అది మైర్మేకో ఫోబియా అనే మానసిక వ్యాధికి దారితీసింది. ఈ వ్యాధికి సంబంధించి గతంలోనే మనీషా పలు కౌన్సిలింగ్‌లు తీసుకుంది. కానీ దాని ద్వారా ఏ మాత్రమూ తగ్గలేదు. తరచూ ఆమె ఆ ఫోబియాతో భయపడి నరకయాతన అనుభవించేది. చివరికి సంచలన నిర్ణయం తీసుకుంది.
చీమలకు భయపడిన మనీషా.. భర్త శ్రీకాంత్ ఇంట్లో లేని సమయంలో రెండు రోజుల క్రితం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఇంటికొచ్చి చూసిన భర్త శ్రీకాంత్.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోర్టుమార్టంకు పంపించి.. ఆమె చనిపోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీషా తన సూసైడ్ నోట్‌లో ‘‘ఐ యాం సారీ. నాకు చీమలు అంటే భయంగా ఉంది. అన్విజాగ్రత్త.. అన్నవరం తిరుపతి 1116 రూపాయలు, ఎల్లమ్మ ఒడిబియ్యం మర్చిపోకు’’ అని రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు
Follow Us