Telangana: అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో విషాదం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారి సహస్ర ప్రాణాలు కోల్పోయింది. కరెంట్ లేని సమయంలో ఫ్యాన్‌కు టవల్ చుట్టి ఆడుకుంది. కరెంట్ రావడంతో ఆ టవల్ మెడకు చుట్టుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.