land dispute: కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు

రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ  ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

New Update
FotoJet - 2025-11-06T121227.662

land dispute threat with gun

land dispute: రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ  ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎల్లంకు గ్రామ శివారులో కొంత భూమి ఉంది.ఈ భూమి విషయంలో ఎల్లంకు గ్రామంలోని కొంతమందితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ వివాదం నేపథ్యంలో మెదక్ జిల్లా కోర్టు నుంచి ఎల్లం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు.కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వివాదం.లో ఇరువురి మధ్య పలు మార్లు గొడవలు సైతం జరిగినట్లు తెలిసింది. భూమిలో వరి పంట వేయడం తో పంట కోసేందుకు ఎల్లం కోర్టు నుంచి స్టే ఆర్డర్ నవంబర్ 1 న తీసుకు వచ్చాడు.

 ఇది కూడా చూడండి: Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్ధులు.. గ్రామ శివారులోని పొలం వద్ద ఎల్లం సహా ఆమె కుటుంబీకులను తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు.  దీంతో సదరు వ్యక్తుల చేతిలో ఉన్న తుపాకీ ని లాక్కున్న సిద్ధమ్మ తరుపు వారు  భయాందోళనకు గురై పోలీస్ లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే అది డమ్మీ తుపాకీగా తేల్చారు. కాగా తుపాకీతో  తమను బెదిరించారని, కాల్చేస్తామంటూ బయపెట్టారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు

వివాదాస్పద భూమి వద్ద డమ్మీ గన్ పెట్టుకొని ఎందుకు ఉన్నాడన్న అనుమానం వ్యక్తం అవుతుంది. కోర్టు స్టే ఆర్డర్ తో వచ్చిన ఎల్లం ను బెదిరించేందుకు డమ్మీ తుపాకీ తీసుకు వచ్చి బెదిరించాడని బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. ఈ విషయం పై మెదక్ రూరల్ సి ఐ జార్జ్ ను వివరణ కోరగా ఘటన స్థలంలో లభ్యమైన గన్ డమ్మీ గన్ అన్నారు. అక్కడ భూ వివాదం సాగుతుందని, ఎందుకు తీసుకు వచ్చాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని వివరణ ఇచ్చారు.

 ఇది కూడా చూడండి: Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!

Advertisment
తాజా కథనాలు