CM Chandrababu:  తొక్కిసలాట ఘటన కలచివేసింది..ఆలయ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

ఏకాదశి రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట జరిగి దాదాపు 9 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు.

New Update
cm chandrababu

CM Chandrababu Naidu

ఏకాదశి రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం(Kashi Bugga Sri Venkateswara Swamy Temple) లో తొక్కిసలాట జరిగి దాదాపు 9 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

తొక్కిసలాట(Srikakulam Stampede) ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు(ap cm chandrababu naidu) స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను సీఎం కోరారు. 

Also Read :  తిరుమలలో జరిగిన అవమానంతో పలాసలో గుడి.. తొక్కిసలాట ఆలయ చరిత్ర ఇదే!

CM Chandrababu Responds On Temple Incident


మంత్రి లోకేశ్(minister-lokesh): కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఏపీ మంత్రి లోకేశ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. పలువురు భక్తులు మృతి చెందడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అనంతరం ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడారు. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని అధికారులకు ఆదేశించానని ఈ సందర్భంగా తెలిపారు.

Also Read :  ఆ ఒక్క తప్పే 9 మంది భక్తుల ప్రాణాలు తీసింది.. శ్రీకాకుళం తొక్కిసలాటలో విస్తుపోయే నిజాలు..!

హోం మంత్రి అనిత(AP Home Minister Anita) : కాశీబుగ్గ ఘటనపై హోంమంత్రి అనిత  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన అనిత ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా సహాయచర్యలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాశీబుగ్గ తొక్కిలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవదాయశాఖ ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి ఆనం గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు