/rtv/media/media_files/2025/09/01/cm-revanth-and-kcr-2025-09-01-13-17-02.jpg)
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ దీనిపై విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI) కి అప్పగించింది రేవంత్ సర్కార్. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(cm-revanth-reddy) అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో NDSA గుర్తించిన అవకతవకలను, కమిషన్ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అప్పగించడం వెనుక పెద్ద వ్యహామే ఉందని తెలుస్తోంది.
Also Read : LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!
ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల రాష్ట్ర పోలీసు లేదా ఇతర రాష్ట్ర సంస్థలు విచారణ జరిపితే, అది నిష్పాక్షికంగా జరగడం కష్టమని, రాజకీయంగా వివాదాస్పదం కావచ్చని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. సీబీఐ విచారణ వల్ల, ఈ కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది, అంతేకాకుండా సీబీఐ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున, మరింత సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉంది.
Also Read : Earth Quake: భారీ భూకంపం.. 500 మందికి పైగా మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటోలు!
బీజేపీ(BJP) కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు సీబీఐకి ఈ కేసు అప్పగించాక ఎలాంటి చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న సంకేతాలు జనాల్లోకి తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ సీబీఐ నిర్ణయం తీసుకుంటే తాము కేసీఆర్ పై కక్ష్యపూరితంగా వ్యవహరించలేదని, కేంద్రమే కేసీఆర్ తప్పు చేశాడని నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లుగా కూడా అవుతుందని రేవంత్ వ్యుహంగా భావిస్తున్నారు.
బీఆర్ఎస్ కూడా అలెర్ట్
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బీఆర్ఎస్(BRS) కూడా అలెర్ట్ అయింది. మాజీ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్(kcr) తో హరీష్ , కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ సమావేశం జరుగుతోంది. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వడం, అసెంబ్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సుధీర్భంగా చర్చింస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం రిపోర్టు పై ఇప్పటికే కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను రేపు హైకోర్టు విచారించనుంది.
మరోవైపు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక.. ఈ రిపోర్టు నిలవదని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చేతగాకనే సీబీఐకి అప్పగించారని అన్నారు. ఇప్పుడైనా సీబీఐకి అప్పజెప్పి మంచి పని చేసిందని ఈటల చెప్పుకొచ్చారు. కాగా 2022లో తెలంగాణలోకి సీబీఐ రాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించింది.
మంచి పని చేశారు. వాళ్ళకి చేతకాదని తెలుసు. వాళ్ళ రిపోర్టు తప్పుల తడక అని తెలుసు. వాళ్ళ రిపోర్టు నిలబడదు అనేది వాళ్ళకి అర్థమైంది, కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఈ పని చేశారు. - ఈటెల రాజేందర్#telangana#eatalarajender#comments#congress#KaleshwaramProject#CBI#RTVpic.twitter.com/qm6kW2cHHi
— RTV (@RTVnewsnetwork) September 1, 2025
Also Read : Recording Dance : వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు..VIDEOS వైరల్