America: ట్రంప్ తిక్క కుదిరింది.. విదేశీ విద్యార్థులు రాకపోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం!

అమెరికా వెళ్లి చదవాలనుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్లు తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. దీనికి ముఖ్య కారణం అమెరికా ప్రభుత్వం ఎఫ్-1 వీసాల జారీని నిలిపివేయడం లేదా ఆపడం వల్ల అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు.

New Update
Trump

Trump

అమెరికా వెళ్లి చదవాలనుకునే విద్యార్థుల ఆశలకు గండి పడింది. అక్కడ విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం అమెరికా ప్రభుత్వం ఎఫ్-1 వీసాల జారీని నిలిపివేయడం లేదా ఆపడం వల్ల అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు వెనకడుగు వేస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తెలిపాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఎఫ్-1 వీసాల అనుమతి 12 శాతం తగ్గినట్లు తెలిపింది. అయితే ఇది మే నెల నాటికి 22 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల అమెరికా విద్యాసంస్థలు సుమారుగా రూ. 61,703 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు సమాచారం. ఆదాయం మాత్రమే కాదు.. విదేశీ విద్యార్థులు లేకపోవడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తోంది. కాలేజీల ద్వారా లభించే ఉద్యోగాలను కూడా 60 వేలకు పైగా స్థానికులు కోల్పోయినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: ‘ట్రంప్ చనిపోయాడు’ వార్తలపై వైట్‌హౌస్ క్లారిటీ

అమెరికా విద్యా రంగంపై ప్రభావం..

విదేశీ విద్యార్థుల రాక తగ్గడంతో కొన్ని కాలేజీలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందపడుతున్నాయి. ఎక్కువ శాతం కాలేజీలు అంతర్జాతీయ విద్యార్థుల ఫీజులపై ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది విదేశీ విద్యార్థులు సగం కంటే ఎక్కువగా తగ్గిపోవడంతో సిబ్బంది జీతాల్లో కోతలు విధించాయి. దాదాపుగా 100కు పైగా కాలేజీలు ఇవే ఉన్నాయి. ఇలానే జరిగితే భవిష్యత్తులో అమెరికా విద్యా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికా విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లకు నిధులు విదేశీ విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచే వస్తాయి. విదేశీ విద్యార్థులు తగ్గితే, స్కాలర్‌షిప్‌లు కూడా భారీగా తగ్గుతాయి.  అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన వీసా విధానాల వల్లే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. 

ట్రంప్ మార్చిన రూల్స్..

ఎఫ్ 1 వీసా ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అమెరికా వెళ్లిన ఏడాదిలో వారి ప్రోగ్రామ్స్‌ను మార్చుకునే అవకాశం ఉండకుండేలా మార్పులు  చేయనున్నారు. ఒక డిగ్రీని చేసిన తర్వాత ఇంకో డిగ్రీ చేయాలంటే స్వదేశానికి వచ్చి మళ్లీ ఎఫ్ 1 వీసాకు అప్లై చేసుకోవాలి. అలాగే ఈ వీసాపై ఒక కోర్సు చేయడానికి వెళ్లి ఇంకో కోర్సు చేయకూడదు. మీరు తీసుకున్న కోర్సు ప్రకారం అమెరికాలో గరిష్టంగా నాలుగేళ్ల పరిమితితో ఎఫ్ 1 వీసా ఇస్తారు.  ఆ తర్వాత కూడా అక్కడ ఉండాలంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి.  అలాగే కోర్సు పూర్తి అయిన తర్వాత ఒకప్పుడు 60 రోజుల సమయం ఉండగా.. ఇకపై 30 రోజులు ఉండేలా సమయం కుదించనున్నారు. ఈ గడువు పూర్తయ్యాక స్వదేశానికి వచ్చి మళ్లీ హెచ్ 1 బీ వీసా పొంది అమెరికా వెళ్లాలనే రూల్ తీసుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: SCO Summit: ఏనుగు, డ్రాగన్ కలిసి అమెరికాపై దండయాత్ర.. SCO సమ్మిట్‌లో కీలక పరిణామం

Advertisment
తాజా కథనాలు