LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఎల్‌పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు తెలిపాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.51.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,580గా ఉంది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.

New Update
Gas Cylinder Price

Gas Cylinder Price

ప్రతీ నెల ఫస్ట్ తారీఖున గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి. గత కొన్ని నెలల నుంచి సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ నెలకు ఆయిల్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఎల్‌పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు తెలిపాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.51.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,580గా ఉంది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. అయితే కేవలం కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కమర్షియల్ ఎల్‌పీజీని ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు లేదా ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. నెలవారీగా గ్యాస్ సిలిండర్లను అధిక సంఖ్యలో ఉపయోగించే వ్యాపారులకు ధరలు తగ్గడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Dmart Business: డీమార్ట్‌లో మీ ప్రొడక్ట్స్ అమ్మాలని అనుకుంటున్నారా.. అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే!

చాలా నెలల్లో తగ్గిన ధరలు..

మార్చి నెల కాకుండా మిగతా నెలల్లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ ఏడాది నుంచి తగ్గుతూనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ధర తగ్గడం వల్ల వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఈ నిర్ణయం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దీనిద్వారా వ్యాపారులు లాభాలు పొందవచ్చు. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో గత కొన్ని నెలల్లో మార్పులు చేసింది. కానీ ఈ సారి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గృహ వినియోగదారుల కోసం సిలిండర్ ధర ఇంతకు ముందు ఉన్న ధరలు కొనసాగనున్నాయి. 

ఇది కూడా చూడండి: Dmart Tips: డీమార్ట్‌లో తక్కువ ధరకే సరుకులు కావాలా.. అయితే ఈ చిన్న టిప్స్ మీరు తప్పకుండా పాటించాల్సిందే!

Advertisment
తాజా కథనాలు