/rtv/media/media_files/2025/08/16/sexual-assault-on-a-five-year-old-boy-2025-08-16-11-53-26.jpg)
Sexual assault on a five-year-old boy
Uppal Child Murder Incident:
హైదరాబాద్(Hyderabad)లో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాకింగ్‌కు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గడ్ కు చెందిన బాలుడి కుటుంబం రామంతాపూర్‌లో నివసిస్తోంది. బాలుడి తల్లిదండ్రులు స్థానిక టింబర్ డిపోలో పని చేస్తున్నారు. కాగా ఈనెల 12న వారి ఐదేళ్ల కుమారుడు కనిపించకుండా పోయాడు. అన్ని చోట్ల వెతికిన అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..
రంగంలోకి దిగిన పోలీసులు సమీప ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. అయితే సీసీ ఫుటేజీలో అనుమానిత వ్యక్తిని గుర్తించారు. అతను బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బీహార్‌కు చెందిన కమర్‌గా తేల్చారు. కమర్ కూడా బాధిత కుటుంబం పనిచేసే డింబర్ డిపోలోనే పనిచేస్తున్నట్లు తేలింది. బాధిత కుటుంబానికి సమీపంలోనే కమర్ కూడా నివసిస్తున్నాడు.అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలుడిని సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లిన కమర్ బాలుడిపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత -- బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్టు అంగీకరించాడు. నిందితుడు సాయంతో ఘటన స్థలాన్ని గుర్తించిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీకి తరలించారు. కమర్ ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Also Read: Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!
కాగా, రోజు తమతో కలిసి పనిచేస్తూనే తమతో పాటే ఉండే కమర్ తమ కుమారుడిని పొట్టన పెట్టుకుంటాడని ఊహించని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అభం శుభం తెలియని పసివాన్ని తన కామదాహనికి బలిచేసిన కమర్‌ను బహిరంగంగా ఉరితీయాలని స్థానికులు కోరుతున్నారు.