Telangana : తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హబ్సిగూడ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బండారి రాజిరెడ్డి 2009లో ఉప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.