Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!

జార్ఖండ్ విద్యా మంత్రి రాందాస్ సోరెన్ (62) శుక్రవారం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా జాతీయ ప్రతినిధి కునాల్ సారంగి ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
ramdas

జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి రాందాస్ సోరెన్ (62) శుక్రవారం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా జాతీయ ప్రతినిధి కునాల్ సారంగి ఈ విషయాన్ని వెల్లడించారు.  "ఢిల్లీలోని చికిత్స పొందుతున్న రాష్ట్ర విద్యా మంత్రి రాందాస్ సోరెన్ ఇక లేరు" అని సారంగి అన్నారు. 2025 ఆగస్టు 2న తన నివాసంలోని బాత్రూంలో  రాందాస్ సోరెన్  పడిపోవడంతో జంషెడ్‌పూర్ నుండి విమానంలో తరలించిన తర్వాత ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. సీనియర్ నిపుణుల బృందం ఆయన చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.  దాదాపు 13 రోజులుగా ఆయన లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆగస్టు 15న ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

మూడుసార్లు ఎమ్మెల్యే 

రాందాస్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. ఆయన ఘట్‌శిల నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1963 జనవరి 1న తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఘోరబంధ గ్రామంలో జన్మించిన రాందాస్ సోరెన్ ఘోరబంద పంచాయతీ గ్రామ ప్రధాన్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  2024లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో ఆయన విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మరణంపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఇతర ప్రముఖ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా కాగా ఆగస్టు 16న ఆయన భౌతికకాయాన్ని తన సొంత గ్రామం జంషెడ్‌పూర్‌కు తరలించనున్నారు.

Advertisment
తాజా కథనాలు