Trump-Putin Meet: పుతిన్ కు ఆర్య-2 సినిమా చూపించిన ట్రంప్.. అగ్రరాజ్యం బలుపు చూపెట్టిన అమెరికా.. ఈ వీడియోలు చూడండి!

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్య 2 సినిమా చూపించారు. ఆయనకు ఆహ్వానం పలుకుతూనే అమెరికాకు ఉన్న బులుపును చూపెట్టారు. స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్ లతో స్వాగతం పలికారు ట్రంప్. 

New Update
b2 bombers

Trump Invited Putin with B2 bombers, F22 jets

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ పనైనా చేస్తే మామూలుగా ఉండదు. ఎక్కడికెళ్లినా తగ్గేదే ల్యా అన్నట్టు ఉంటారు. అందరి కంటే తానే బలవంతుడు, తన దేశమే బలమైన దేశం అని నిరూపించాలని చూస్తుంటారు ట్రంప్. ఈరోజు జరిగిన సమావేశంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోయారు ట్రంప్. 

బాంబర్లు, ఫైటర్ జెట్ లతో స్వాగతం..

ఆర్య సినిమా గుర్తుందా.. అందులో పెళ్ళికి వస్తూ కత్తులూ, కటార్లు పట్టుకుని వస్తారు. ఎప్పుడూ బొడ్డులో దోపుకుని ఏ చిన్న తేడా వచ్చినా పైకి తీస్తుంటారు. ట్రంప్ కూడా ఇదే స్టైల్ ను ఫాలో అయిపోయారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశానికి స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలను వెంట పెట్టుకుని వెళ్ళారు. పుతిన్ ను ఆహ్వానిస్తున్నప్పుడు అమెరికా శక్తిని ఏంటో చూపించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం భేటీ అయినప్పటికీ...రష్యాకు తమ బలమేంటో చూపించాలనుకున్నారు ట్రంప్. దానికి తగ్గట్టే ప్రిపేర్ అయి వెళ్ళారు. తమ అమ్ముల పొదిలో ఉన్న ఆయుధాల ప్రదర్శన చేశారు. వ్లాదిమిర్ పుతిన్ యాంకరేజ్ నగరంలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ వద్ద తన విమానం నుండి దిగి పుతిన్ ను.. ట్రంప్‌ కలుస్తున్నప్పుడు, B-2 స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్‌లు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. తరువాత సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గల్లో చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసింది. 

ప్రపంచమంతా ఆసక్తిగా..

ట్రంప్, పుతిన్ మధ్య భేటీపై ప్రపంచం అంతా ఆసక్తి చూపించింది. ఈ సమావేశానికి సంబంధించి చాలా దేశాలతో కనెక్షన్ ఉండడమే ఇందుకు కారణం. ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు, కాల్పుల విరమణ భేటీలో ముఖ్యమైన అంశమే అయినప్పటికీ..దీనితో ముడిపడి అనేక అంశాలున్నాయి. వాటిల్లో భారత్ పై విధించిన అదనపు సుంకాలు ఒకటి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్ తో యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారని...భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. దిగుమతులు మానేయకపోతే అదనపు సుంకాలు విధిస్తానని చెప్పారు. దానికి తగ్గట్టుగానే 50 శాతం సుంకాలతో భారత్ పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు రష్యాతో సమావేశం తర్వాత ఈ టా రీఫ్ లు తగ్గుతాయని అందరూ భావించారు. వీటిపై కూడా చర్చిస్తారని అనుకున్నారు. కానీ అదేమీ జరిగినట్టు కనిపించడం లేదు. అసలు సుంకాల ప్రస్తావనే రాలేదని తెలుస్తోంది.

Also Read: No Tariffs Talks: సుంకాలపై భారత్ కు తప్పని నిరాశ..ఆ వూసే ఎత్తని అధినేతలు 

Advertisment
తాజా కథనాలు