Janmabhoomi Express: ప్రయాణికులకు గమనిక.. సికింద్రాబాద్‌ To విశాఖకు వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూటు మారింది!

విశాఖపట్నం To లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూటు మారింది. ఏప్రిల్ 25 నుంచి ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఆగదు. ఇక నుంచి లింగంపల్లి నుంచి చర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నాగర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

New Update
Vizag Lingampally Janmabhoomi Express train route changed

Vizag Lingampally Janmabhoomi Express train route changed

దేశ వ్యాప్తంగా ట్రైన్ జర్నీ (Train Journey) కి ఫుల్ డిమాండ్ ఉంది. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రధానమైన రైల్వేస్టేషన్లుగా ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు భారీ సంఖ్యలో ప్రయాణికులు చేరుకుంటారు. ఈ స్టేషన్‌లలో ఎప్పుడు చూసినా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. 

Also read :  ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఇటీవల చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించారు. ఇది హైదరాబాద్‌లోనే అతి పెద్ద రైల్వే టెర్మినల్‌గా ఉంది. దీనిని దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ స్టేషన్‌ నుంచి పలు ప్రాంతాలకు ట్రైన్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

ట్రైన్ రూటు మార్పు

ఇందులో భాగంగా మరో  రైళును చర్లపల్లి నుంచి నడిపిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. జన్మభూమి (12805, 12806) ఎక్స్‌ప్రెస్ రైలు (Janmabhoomi Express) ను ఇకనుంచి సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో హాల్ట్ ఉండదని రైల్వే శాఖ తెలిపింది. దీనిని ఏప్రిల్ 25 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొంది. 

Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్‌

ఈ ట్రైన్ గతంలో లింగంపల్లి – విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు ఆ రూట్‌ను రైల్వే శాఖ మార్చింది. ఇకనుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి, అమ్ముగూడ, సనత్‌నగర్ రూట్‌లలో మళ్లించినట్లు తెలిపింది. ఏప్రిల్ 25 నుంచి 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి మీదుగా పరుగులు పెట్టనుంది.

మార్నింగ్ 6.20 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడ 5 నిమిషాల ఆగి.. తర్వాత సాయత్రం 6.10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి అమ్ముగూడ మీదుగా రాత్రి 7.40 గం.లకు లింగంపల్లికి చేరుకుంటుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు