/rtv/media/media_files/2025/03/13/smMWA3g4hIslce2W8lAy.jpg)
The Woman in the Yard
The Woman in the Yard: బ్లమ్‌హౌస్ నిర్మాణంలో వస్తున్న 'ది ఉమెన్ ఇన్ ది యార్డ్' అనే హర్రర్ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్ విడుదలైంది. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబం చుట్టూ తిరిగే కథతో పూర్తి హారర్ జోనర్లో తెరకెక్కింది ఈ మూవీ. పట్టా పగలే భయపెడుతూ వణుకు పుట్టించే సౌండ్ ఎఫెక్ట్స్ తో టీజర్ అదిరిపోయింది.
టీజర్ లో నల్లటి ముసుగు వేసుకున్న ఒక మహిళను చూపించారు. ఆమె సాధారణ మహిళ లా కాకుండా ముఖం మీద ముసుగుతో నల్లటి వస్త్రాలు కప్పుకుని ఉంది. చేతిలో రక్తంతో భయంకరంగా కనిపిస్తుంది. కారు ప్రమాదంలో తన భర్తను కోల్పోయిన ఒక మహిళ తన 14 ఏళ్ల కుమారుడు (పేటన్ జాక్సన్), 6 ఏళ్ల కుమార్తె (ఎస్టెల్లా కహిహా) లను ఆ నల్లటి వస్త్రాలు ధరించిన మహిళ నుండి రక్షించుకోవడం సినిమా కథ.
Also Read: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
మార్చి 28, 2025న థియేటర్లలో...
యార్డ్‌లో కూర్చుని ఆ కుటుంబాన్ని చంపి, తినడానికి ప్రయత్నించే నల్లటి స్త్రీ ని చూపిస్తూ లాగుతుంది టీజర్. ఈ చిత్రానికి దర్శకుడు జామ్ కొల్లెట్-సెర్రా. టీజర్ మాత్రం భయపెడుతూ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా అదిరిపోయింది. ఈ మూవీ 'ది ఉమెన్ ఇన్ ది యార్డ్' మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వణుకు పుట్టించే ఈ హారర్ టీజర్ ను మీరూ చూసేయండి.