/rtv/media/media_files/2025/02/17/T6ZFoKO1PuWXibd1KG6D.jpg)
CM Revanth Reddy
కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు.. అసెంబ్లీలో చర్చలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చ ఆట్ చేశారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిని చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కిషన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. తాను కేంద్రాన్ని ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదన్నారు. RRR, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నానన్నారు.
నిరుద్యోగ రేటు తగ్గించాం..
తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. నిరుద్యోగ రేటును 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానన్నారు. అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నానని చెప్పారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసినవారికి ఒకేసారి 37 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చానని గుర్తు చేశారు రేవంత్. అందులో భాగంగానే ఇప్పుడు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు..
డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామన్నారు. కేంద్ర కేబినెట్లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారన్నారు. అదే.. మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం ఇక్కడి అంశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.