Tirupat: బాలుడి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ
తిరుపతి బస్టాండ్‌లోకిడ్నాప్ అయిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని నిందితుడు సుధాకర్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. సుధాకర్ చిన్నారిని ఏర్పేడులోని తన అక్క ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఏర్పేడులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడి నుంచి బాలుడ్ని తీసుకొని ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చిన్నారిని అప్పగించారు.