Chhangur Baba : హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ముస్లింలకు నిధులు.. ఛంగూర్ బాబా అరాచకాలు!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన  జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా గత మూడు సంవత్సరాలుగా హిందూ బాలికలను మతమార్పిడి కోసం వలలో వేసుకుని 1,000 మందికి పైగా ముస్లిం పురుషులకు నిధులు సమకూర్చాడు. అతని ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఈడీ రెడీ అయిపోయింది.

New Update
up

ఉత్తరప్రదేశ్‌కు చెందిన  జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా గత మూడు సంవత్సరాలుగా హిందూ బాలికలను మతమార్పిడి కోసం వలలో వేసుకుని 1,000 మందికి పైగా ముస్లిం పురుషులకు నిధులు సమకూర్చాడు. అతని ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఈడీ రెడీ అయిపోయింది. అతనికి సంబంధించిన 30 బ్యాంకు అకౌంట్లపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగా.. ప్రస్తుతానికి 18 అకౌంట్లకు సంబంధించిన సమాచారం  మాత్రం బయటకు వచ్చింది.  వీటిల్లో దాదాపు రూ.68 కోట్ల మేరకు లావాదేవీలుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో మూడు నెలల్లోనే విదేశాల నుంచి రూ.7 కోట్లు బదిలీ అయినట్లుగా విచారణలో తేలింది. ఛంగూర్ బాబా ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లోని ముస్లిం పురుషులకు ఈ చెల్లింపులు పంపాడు.

Also Read :  స్పెయిన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వందల మందికిపైగా గల్లంతు

Also Read :  అసీమ్‌ మునీర్‌కు అధ్యక్ష పదవి !.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన

మహిళలను లక్ష్యంగా చేసుకుని

పేద, వితంతువులు బలహీన వర్గాలకు చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ఒక క్రమపద్ధతిలో మతమార్పిడి రాకెట్‌ను నిర్వహించడానికి ముస్లిం దేశాల నుండి రూ. 500 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం.  మతమార్పిడల రాకెట్ ను నిర్వహించడానికి జలాలుద్దీన్‌ ఓ కోడ్ బాషను ఊపయోగించేవాడు. తాజాగా యూపీ ఏటీఎస్‌ దీనిని ఛేదించింది. ఛంగూర్ బాబాతో పాటు, అతని సహచరురాలు నీతు అలియాస్ నస్రీన్‌ను కూడా అరెస్టు చేసి ఏడు రోజుల ATS కస్టడీకి పంపారు. విదేశాల నుండి వచ్చే నిధులను నీతు నస్రీన్ నిర్వహించేది.   విదేశీ నిధుల సంబంధాలను వెలికితీసేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వీరిద్దరినీ విచారించనున్నారు. 

Also Read :  స్పెయిన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వందల మందికిపైగా గల్లంతు

Also Read :  అసీమ్‌ మునీర్‌కు అధ్యక్ష పదవి !.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన

Uttar Pradesh | Hindu girls | Trapping | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు