/rtv/media/media_files/2025/11/03/two-sisters-lost-their-parents-in-chevella-bus-accident-2025-11-03-16-20-46.jpg)
Two Sisters Lost Their Parents In Chevella Bus Accident
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం(Chevella Bus Accident) తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దంపతుల పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన స్థలంలో నిర్జీవంగా పడిఉన్న తమ అమ్మానాన్నలను చూసుకుంటూ పిల్లలు ఏడుస్తుంటడం అందరినీ కంటతడి పెట్టించింది.
Also Read: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్ - దారుణమైన విజువల్స్
Chevella Bus Accident
ఇక వివరాల్లోకి వెళ్తే సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న RTC ఎక్స్‌ప్రెస్ బస్సును కంక లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ ఢీకొంది. బస్సులో కంకర లోడు కూడా పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మరో 20 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also read: ఓరి దేవుడా.. వాళ్లు 12 గంటలు ఆడారు మేడమ్.. సీఎం మమతా బెనర్జీ ట్వీట్ కు బీజేపీ కౌంటర్!
క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. అయితే బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. బస్సుపై టిప్పర్ పడిపోవడంతో అది నుజ్జు నుజ్జు అయిపోయింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: పాక్ అణ్వాయుధాలు పరీక్షిస్తోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
 Follow Us